PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ మరోసారి నీరసించిపోయారు. ఒకపక్క జనసేన తన కృషితో ఆయా ఎన్నికలలో కాస్తైనా ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. అయినా ఒక్కసారి అలా కనపడి, ఓటర్లకు మరియు గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోవడం తప్ప మరొకటి కనిపించడం లేదు. కేవలం సేన ఉత్సాహంగా పనిచేయడం తప్ప ఆయన అదేదో గెస్ట్ లాగ రావడం, కాసేపు ఫోటోలకు పోజులు ఇవ్వడం లేదంటే ఏదైనా ఘాటుగా స్పందించడం వెళ్లిపోవడం. ఇటీవల ఎదో ప్రచారం కోసం రోడ్లు బళ్ళు అంటూ శుభ్రతా కార్యక్రమాలు చేశారు తప్ప అనంతరం మళ్ళీ కనిపించలేదు. బహుశా ఆయన సిjanasena-pk;{#}kalyan;Janasena;Army;Yevaru;CM;Party;Cinema;MLAజనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!janasena-pk;{#}kalyan;Janasena;Army;Yevaru;CM;Party;Cinema;MLAFri, 19 Nov 2021 10:14:02 GMTపవన్ కళ్యాణ్ మరోసారి నీరసించిపోయారు. ఒకపక్క జనసేన తన కృషితో ఆయా ఎన్నికలలో కాస్తైనా ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. అయినా ఒక్కసారి అలా కనపడి, ఓటర్లకు మరియు గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోవడం తప్ప మరొకటి కనిపించడం లేదు. కేవలం సేన ఉత్సాహంగా పనిచేయడం తప్ప ఆయన అదేదో గెస్ట్ లాగ రావడం, కాసేపు ఫోటోలకు పోజులు ఇవ్వడం లేదంటే ఏదైనా ఘాటుగా స్పందించడం వెళ్లిపోవడం. ఇటీవల ఎదో ప్రచారం కోసం రోడ్లు బళ్ళు అంటూ శుభ్రతా కార్యక్రమాలు చేశారు తప్ప అనంతరం మళ్ళీ కనిపించలేదు. బహుశా ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండవచ్చు.

ఇప్పటికే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే వైపుకు వెళ్ళిపోయాడు. పార్టీలో ప్రధానంగా చేరికలు కూడా పెద్దగా లేవు. ఎవరైనా ఎందుకు వస్తారు, ఎందుకు చేరతారు, ఒక్కసారి పట్టుబడితే పదవి వచ్చేవరకు కృషి చేయకతప్పదు, ప్రజాక్షేత్రంలోకి వస్తే అలాగే ఉంటుంది. అంతే కానీ కేవలం గెస్ట్ మాదిరి వచ్చి కనిపించి పోతే అసలు పార్టీ ఉన్నది లేనిది కూడా తెలియకుండా పోతుంది. ఇలాంటి పార్టీని, నాయకుడిని నమ్మి ఎవరు పార్టీ వైపు రాగలరు. ప్రజాసేవ చేయాలని ఉండొచ్చుగాక, కానీ అది నీకు ఉందని ఒక్కసారైనా ప్రజలకు  నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

అలా కాకుండా ఎప్పుడో ఒకసారి కనిపించి నన్ను సీఎం ను చేస్తే మీకు మేలు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు. అసలు నిర్వహణ సామర్థ్యం నీకు లేదనే అపనమ్మకం కూడా ఇప్పటికే ప్రజలలో బయలుదేరే ఉండొచ్చు. ఏదో సినిమాలు తీసుకుంటూ నలుగురికి సాయం చేయమంటే సరే కానీ, పెద్ద రాజకీయ వ్యవస్థను నిర్వహించలేకపోతున్నాడు అనే అపవాదు ఇప్పటికే జనసేన అధినేతపై ప్రజలలో కలిగింది అని చెప్పవచ్చు. ఒక్కసారి అది కలిగిన తరువాత మళ్ళీ నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రజాక్షేత్రం అంటే ఇలాగె ఉంటుంది, ఇప్పటి వరకు మోసం చేసిన వాళ్ళను చూసిన ప్రజలు ఒక నిజాయితీ పరుడు వచ్చినా నమ్మకం కలగడానికి కాస్త సమయం పడుతుంది. ఆ నమ్మకం కల్పించుకుని బాధ్యత నేతది, ప్రజలది కాదు. అది అర్ధం చేసుకుంటే అప్పుడు ప్రజాసేవకు ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలం. అదే లోపిస్తుంది అధినాయకత్వంలో, అందుకే విజయాలు కూడా అలాగే ఉన్నాయి.



రైతు విజయం: మోడీ సారీ చెప్పారు..!

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>