PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-assembly4e32fb66-5933-4b9c-89d1-9c4048b906a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-assembly4e32fb66-5933-4b9c-89d1-9c4048b906a1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను మళ్ళీ సిఎం గానే సభలో అడుగు పెడతాను అంటూ శపథం చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం సంచలనం అయింది. అయితే అసలు సభలో ఏం జరిగింది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు కాస్త గట్టిగానే పేలుతున్నాయి. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం వివాదాస్పదంap{#}TDP;YCP;Jagan;CBNబ్రేకింగ్: అసలు ఏపీ శాసన సభలో ఏం జరిగింది...?బ్రేకింగ్: అసలు ఏపీ శాసన సభలో ఏం జరిగింది...?ap{#}TDP;YCP;Jagan;CBNFri, 19 Nov 2021 13:25:05 GMTఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను మళ్ళీ సిఎం గానే సభలో అడుగు పెడతాను అంటూ శపథం చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం సంచలనం అయింది. అయితే అసలు సభలో ఏం జరిగింది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు కాస్త గట్టిగానే పేలుతున్నాయి. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం వివాదాస్పదం అయింది.

ఆఖరికి చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడటంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెంది కంటతడి పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి కంట తడి పెట్టుకున్నారు. ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డాను అని... నా భార్య, నా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని  నా భార్యను అవమానించేలా మాట్లాడారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ సమయంలో సభలో జగన్ నవ్వుతూ కనపడటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. నా కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారు అని ఎప్పుడూ లేని అవమానాలు భరించాను అన్నారు చంద్రబాబు. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే.. బాబు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్‌ కట్‌ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు బయటకు వస్తూ తాను మళ్ళీ సిఎం అయిన తర్వాతే శాసన సభలో అడుగు పెడతాను అంటూ సవాల్ చేసారు.



బ్రేకింగ్: అసలు ఏపీ శాసన సభలో ఏం జరిగింది...?

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>