PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona78ccad3c-384c-4a74-89f3-0707b8f60f72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona78ccad3c-384c-4a74-89f3-0707b8f60f72-415x250-IndiaHerald.jpgలాక్‌ డౌన్.. ఈ పదం విని చానాళ్లయింది కదా.. ఇప్పుడు మళ్లీ ఈ పదం వినిపిస్తోంది. అయితే అది మన దేశంలో కాదు లెండి.. యూరప్‌లో ఉన్న ఆస్ట్రియా దేశంలో మళ్లీ లాక్‌ డౌన్ విధించ బోతున్నారు. వచ్చే సోమ వారం నుంచి ఆస్ట్రియాలో లాక్‌ డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశంలో కొవిడ్‌ కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అవుతున్నాయి మరి. అందుకే సోమవారం నుంచి పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆస్ట్రియా దేశం ప్రకటించింది. ఈ విధంగా పశ్చిమ యూరప్‌లో లాక్‌డౌన్‌ విధించిన తొలి దేశంగా ఆస్ట్రియా నిలుస్తోంది. ఇంcorona{#}Saturday;monday;Austria;February;thursday;Coronavirus;Governmentబాబోయ్.. అక్కడ మళ్లీ లాక్‌ డౌన్..?బాబోయ్.. అక్కడ మళ్లీ లాక్‌ డౌన్..?corona{#}Saturday;monday;Austria;February;thursday;Coronavirus;GovernmentFri, 19 Nov 2021 23:15:10 GMTలాక్‌ డౌన్.. ఈ పదం విని చానాళ్లయింది కదా.. ఇప్పుడు మళ్లీ ఈ పదం వినిపిస్తోంది. అయితే అది మన దేశంలో కాదు లెండి.. యూరప్‌లో ఉన్న ఆస్ట్రియా దేశంలో మళ్లీ లాక్‌ డౌన్ విధించ బోతున్నారు. వచ్చే సోమ వారం నుంచి ఆస్ట్రియాలో లాక్‌ డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశంలో కొవిడ్‌ కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అవుతున్నాయి మరి. అందుకే సోమవారం నుంచి పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆస్ట్రియా దేశం ప్రకటించింది. ఈ విధంగా పశ్చిమ యూరప్‌లో లాక్‌డౌన్‌ విధించిన తొలి దేశంగా ఆస్ట్రియా నిలుస్తోంది.


ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. గురువారం రోజు వారీ కేసులు పది వేలు దాటుతున్నాయట. దీంతో ఆ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతే కాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ దేశంలో వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తున్నారు. ఈ మేరకు ఆస్ట్రియా ఛాన్సలర్‌ అలెగ్జాండర్‌ స్కాలెన్‌ బర్గ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక తమ దేశంలో సోమ వారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని 10రోజుల తర్వాత సమీక్షిస్తామన్నారు.


ఈ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. టీకా వేసుకోవాలని కొన్నినెలలుగా ఆస్ట్రియా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో ఆస్ట్రియా ఛాన్సలర్‌ అలెగ్జాండర్‌ లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆస్ట్రియా మాత్రమే కాదు.. ఆ దేశం పొరుగున ఉన్న హంగరీ కూడా కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేసింది.  అంతే కాదు.. హంగరీలో మరింత స్ట్రిక్ట్‌గా రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. అందుకే శనివారం నుంచి ఇళ్లలోనూ మాస్క్‌ ధరించటం తప్పనిసరి చేసింది. ఈ మేరకు హంగరీ ప్రభుత్వ వర్గాలు వివరించాయి.  


ఇలా మొత్తానికి యూరప్‌ అంతా కరోనా పంజా విసురుతోంది. అందుకే పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.  యూరప్‌లో రోజు వారీ కేసులు, మరణాలు ఎక్కువ స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి మిడిల్ యూరప్‌లోని చాలా దేశాల్లో భారీగా మరణాలు వస్తున్నాయి.



బాబోయ్.. అక్కడ మళ్లీ లాక్‌ డౌన్..?

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>