PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/farmera0fb69b7-6dfe-4aed-9058-9e794de79679-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/farmera0fb69b7-6dfe-4aed-9058-9e794de79679-415x250-IndiaHerald.jpgదేశంలో రైతన్న మరోసారి విజయం సాధించాడు.. నెలల తరబడి ఓపికగా పోరాడి ఏకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడు. ఈ దేశానికి అన్నం పెట్టడమే కాదు.. అవసరమైతే పోరాటమూ తెలుసని నిరూపించాడు. అలుపెరగకుండా.. పోరాడి ఈ దేశానికి పరోక్షంగా మేలు చేశాడు.. రైతన్న నెలల తరబడి చేసిన పోరాటంతో కేంద్రం దిగొచ్చింది. నూతన సాగు చట్టాలపై వెనక్కి తగ్గింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామంటూ ఏకంగా ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ.. పార్లమెంట్ సమావేశాల్లో సాగు FARMER{#}Parliment;Bharatiya Janata Party;Government;central government;Prime Ministerరైతు విజయం: మోడీ మెడలు వంచిన రైతన్న!రైతు విజయం: మోడీ మెడలు వంచిన రైతన్న!FARMER{#}Parliment;Bharatiya Janata Party;Government;central government;Prime MinisterFri, 19 Nov 2021 09:41:51 GMTదేశంలో రైతన్న మరోసారి విజయం సాధించాడు.. నెలల తరబడి ఓపికగా పోరాడి ఏకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడు. ఈ దేశానికి అన్నం పెట్టడమే కాదు.. అవసరమైతే పోరాటమూ తెలుసని నిరూపించాడు. అలుపెరగకుండా.. పోరాడి ఈ దేశానికి పరోక్షంగా మేలు చేశాడు.. రైతన్న నెలల తరబడి చేసిన పోరాటంతో కేంద్రం దిగొచ్చింది. నూతన సాగు చట్టాలపై వెనక్కి తగ్గింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామంటూ ఏకంగా ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.


నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ.. పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామన్నారు. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటన చేస్తామని ప్రధాని చెప్పడం ద్వారా సాగు చట్టాలకు మంగళం పాడేశారు.అన్నదాతల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోడీ..వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచామని చెప్పుకున్నారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషి చేస్తామన్నారు. 22 కోట్ల భూసార పరీక్ష కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు.


రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్న ప్రధాని.. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఫసల్ బీమా యోజనని తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఇలాంటి డైలాగులు మోడీ ఎన్నికొట్టినా సాగు చట్టాలపై బీజేపీ చేసిన రాద్దాంతం మాత్రం రైతన్న మరిచిపోయేదేమీ కాదు.  


రైతు ఉద్యమంపై చాలా నెలలుగా ఎదురుదాడి వ్యూహంతో నెట్టుకొట్టిన బీజేపీ సర్కారు.. చివరకు ప్రజావ్యతిరేకతకు భయపడి దిగొచ్చినట్టు కనిపిస్తోంది. ఆలస్యంగానైనా మోడీ సర్కారు మేలుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే.  ఏ లక్ష్యంతో చేసినా.. ఏ పరిణామాలతో చేసినా మోడీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం దేశానికి మేలు చేసేదే.. ఒక్క రైతులకే కాదు.. ఆహారం తీసుకునే ప్రతి భారతీయుడికీ మేలు చేసేది ఈ నిర్ణయం.



రైతు విజయం : ఆ మూడు రాష్ట్రాల పోరాటమే

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>