PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jayalalitha-chandrababu9ca600df-45db-4993-91a6-71ebd2bc686f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jayalalitha-chandrababu9ca600df-45db-4993-91a6-71ebd2bc686f-415x250-IndiaHerald.jpgఈ రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌.. అవ‌మాన‌క రం. స‌భ‌లో చ‌ర్చించాల్సిన విష‌యాల‌ను వ‌దిలేసి.. కేవ‌లం రెచ్చ‌గొట్టే ధోర‌ణితోనే వైసీపీ వ్య‌వ‌హ‌రించిం ది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకుటుంబాన్ని వైసీపీ మంత్రులు టార్గెట్ చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. దీనినే టీడీపీ నాయ‌కులు కూడా పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా.. ఒక్క‌సా రిగా స‌భా వ్య‌వ‌హారాలు మ‌లుపు తిరిగాయి. ఈ క్ర‌మంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌భ నిర్ఘాంత పోయింది. చంద్ర‌Jayalalitha ChandraBabu{#}CM;YCP;Party;Minister;TDP;Andhra Pradesh;Naniనేటి జయలలిత : చంద్రబాబునేటి జయలలిత : చంద్రబాబుJayalalitha ChandraBabu{#}CM;YCP;Party;Minister;TDP;Andhra Pradesh;NaniFri, 19 Nov 2021 15:00:21 GMTఈ రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌.. అవ‌మాన‌క రం. స‌భ‌లో చ‌ర్చించాల్సిన విష‌యాల‌ను వ‌దిలేసి.. కేవ‌లం రెచ్చ‌గొట్టే ధోర‌ణితోనే వైసీపీ వ్య‌వ‌హ‌రించిం ది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకుటుంబాన్ని వైసీపీ మంత్రులు టార్గెట్ చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. దీనినే టీడీపీ నాయ‌కులు కూడా పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా.. ఒక్క‌సా రిగా స‌భా వ్య‌వ‌హారాలు మ‌లుపు తిరిగాయి. ఈ క్ర‌మంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌భ నిర్ఘాంత పోయింది.

చంద్ర‌బాబు ఇంట్లోని వారిని.. ముఖ్యంగా ఆయ‌న స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రిని టార్గెట్ చేస్తూ.. నాని చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టించాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడా ఒక్క‌నిముషం పాటు.. నిశ్చేష్టులై ఉండిపోయారు. ప్ర‌జ‌ల కోసం.. తాను రాజ‌కీయాల్లో ఎన్నో ప‌డ్డాన‌ని.. ఇప్పుడు త‌న ఇంట్లో మ‌నుషుల‌ను కూడా అన‌రాని మాటలు అంటున్నార‌ని.. ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఇక‌, తాను స‌భ‌లో ఉండేది లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాతే స‌భ‌లోకి అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేశారు. ఆ వెంట‌నే అక్క‌డ నుంచి నిష్క్ర‌మించారు.

అయితే.. తాజాగా ఏపీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు మూడు ద‌శాబ్దాల కింద‌ట‌.. త‌మిళ‌నాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు మ‌ధ్య పోలిక ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌ట్లో త‌మిళ‌నాడులో క‌రుణానిధి అధికారంలో ఉన్న స‌మ‌యంలో అన్నాడీఎంకే అధినేత జ‌య‌ల‌లిత ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. ఈ స‌మ‌యంలో స‌బ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఏకంగా.. అధికార పార్టీ స‌భ్యులు జ‌య‌ల‌లిత చీర‌లాగే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో తీవ్ర ర‌చ్చ జ‌రిగింది. ఆ వెంట‌నే జ‌య‌ల‌లిత‌.. తీవ్ర శ‌ప‌థం చేశారు. తాను ముఖ్య‌మంత్రి అయ్యేవ‌ర‌కు.. స‌భ‌లోకి వ‌చ్చేది లేద‌ని.. శ‌ప‌థం చేశారు. అన్న‌ట్టుగానే జ‌య‌ల‌లిత సీఎం అయి.. త‌ర్వాత‌.. క‌రుణానిధిని అర్ధ‌రాత్రి అరెస్టు చేయించారు. ఇప్పుడు కూడా ఇలానే జ‌రిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 



అప్పుడు కూడా నేను బాధ పడలేదు: చంద్రబాబు

బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్

మోడీ చెప్పిన నమ్మని రైతులు.. కీలక నిర్ణయం?

బ్రేకింగ్: కడపలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు

బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>