PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-police-f5b5f126-7b88-446b-a391-e58dd7e4ae8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-police-f5b5f126-7b88-446b-a391-e58dd7e4ae8e-415x250-IndiaHerald.jpgపొలిటిషియన్ నీడలోనే ఉంటాడు. అవినీతి మరకలు ఎన్ని ఉన్నా కూడా పట్టించుకోడు. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాగితం రాయాలన్న తప్పక ఎస్సై చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ల్యాండ్ సెటిల్మెంట్లు, కుటుంబ తగాదా లూ ఇవన్నీ పోలీసుల కన్ను దాటిపోవు. పోలేవు. వీరితో పాటూ ప్రయివేటు వ్యక్తులు (ఒకప్పుడు అంధవరపు వరంలాంటి వ్యక్తు లు చే సిన విధంగా సెటిల్మెంట్లు) చేసే సెటిల్మెంట్లు ఎలానూ ఉండనే ఉన్నాయి. ఇంకేం పోలీసులకు డబ్బే డబ్బు. స్టేషన్ కు పోవా లంటే జనానికి భయం జబ్బు. డబ్బు జబ్బు ఉన్నంత కాలం వ్యవస్థల్లో మార్పు రాదు కానీ వేరే ప్రతap police {#}Srikakulam;Avunu;contract;Komaram Bheem;Reddy;Jagan;policeఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!ap police {#}Srikakulam;Avunu;contract;Komaram Bheem;Reddy;Jagan;policeThu, 18 Nov 2021 11:41:23 GMT 
జై భీమ్ లాంటి కథ ప్రతి వీధిలోనూ ఉంటుంది. ప్రతి ఊళ్లోనూ ఉంటుంది. ఊళ్లో పోలీసు పొలిటీషయన్ మాటే వింటాడు. డ్యూటీ ఎక్కిన రోజు నుంచి దిగిన రోజు వరకూ పొలిటిషియన్ నీడలోనే ఉంటాడు. అవినీతి మరకలు ఎన్ని ఉన్నా కూడా పట్టించుకోడు. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాగితం రాయాలన్న తప్పక ఎస్సై చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ల్యాండ్ సెటిల్మెంట్లు, కుటుంబ తగాదా లూ ఇవన్నీ పోలీసుల కన్ను దాటిపోవు. పోలేవు. వీరితో పాటూ ప్రయివేటు వ్యక్తులు (ఒకప్పుడు అంధవరపు వరంలాంటి వ్యక్తు లు చే సిన విధంగా సెటిల్మెంట్లు) చేసే సెటిల్మెంట్లు ఎలానూ ఉండనే ఉన్నాయి. ఇంకేం పోలీసులకు డబ్బే డబ్బు. స్టేషన్ కు పోవా లంటే జనానికి భయం జబ్బు. డబ్బు జబ్బు ఉన్నంత కాలం వ్యవస్థల్లో మార్పు రాదు కానీ వేరే ప్రత్యామ్నాయం ఏదయినా ఉంటే వెతకండి. అప్పుడు పెద్ది రెడ్డి లాంటినాయకులు నడుపుతున్న విధంగా సమాంతర ప్రభుత్వ నిర్మాణాలు సులువు అవుతాయి. కనుక ఇప్పటికే చాలా చేశారు చాలు కానీ.. ఇక నుంచీ అయినా స్టేటిల్ సెటిల్మెంట్లు ఆపండి సర్....! గౌరవ ఎస్పీ వీటిపై దృష్టి సారిస్తారని కోరుకోవడం అత్యాశే కానీ..ఆశను వదులుకోవడం అన్నది భావ్యం కాదు.



చాలా వెనుకబడిన ప్రాంతం. చాలా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. కానీ ఇక్కడ అవేవీ ఉండవు. ఇక్కడ అవేవీ ఎవ్వరికీ పట్టవు. స్టేషన్ కు పోతే న్యాయం కాదు ముందు ఒప్పందం కుదరాలి. న్యాయం మాట దేవుడెరుగు. సీఐ కానీ ఎస్సై కానీ ముందు సెటి ల్మెంట్ చేసుకునేందుకు లేదా చేయించుకునేందుకు ఇరు వర్గాలూ సిద్ధం గా ఉండాలని చెబుతారు. స్టేషన్ బయట ఓ పది మంది అస్సలు సంబంధం లేని వ్యక్తులు హల్ చల్ చేస్తుంటారు. ఆ విధంగా అంగబలం ఈ విధంగా అర్థబలం కలిసి శ్రీకాకుళం వాకిట న్యా యం అని నినదిస్తే అన్యాయం ఒక్కటే బదులవుతుంది. నోట్ల కట్టలు జేబులు మారి పొలిటీషియన్లకూ సాయం చేస్తున్నాయి. ప బ్లిక్ కు ఆ పాటి చైతన్యం లేక పోతే ఎవ్వడూ ఏం చేయలేడు. పనికిమాలిన వ్యవస్థలూ అవి చేసే పనులూ ఎప్పుడూ ఇలానే ఉం టాయి. ఇంతకుమించి మీరు కానీ నేను కానీ సాధించేదేమీ ఉండదు గాక ఉండదు.

పవిత్రం అయిన ఉద్యోగం.. పవిత్రం అనుకునే ఉద్యోగం..కర్తవ్య దీక్షకు దగ్గరగా ఉండే ఉద్యోగం. అవును ఆ ఒంటికి అంటిన చెమట చుక్క చూస్తే తప్పక కన్నీరొస్తుంది. డ్యూటీ చేసే ఆఫీసరుకు మొక్కాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా ఉందా? ఎందుకుంటుంది ?



ఒకప్పటి పోలీసు ఇప్పుడు లేడు. ఒకనాటి నిజాయితీ ఇప్పట్లో రాదు. ఏం చేసినా చేయకున్నా జీతం వచ్చేందుకు అవకాశాలు సులువు. సొమ్ములు పిండుకునేందుకు అడ్డదారులూ, ఆదాయ మార్గాలూ ఎన్నో! ఎన్నెన్నో ! పబ్లిక్ నుంచి తిరుగుబాటు లేదు. సో..ఇప్పట్లో వీరికి వచ్చిన ఇబ్బందేం ఉండదు. అదేవిధంగా పబ్లిక్ నుంచి ప్రొటెస్ట్ లేదు. సో..ఇప్పట్లో వీరికి వచ్చిన కష్టమేమీ ఉండదు.



అవును! మా ఊళ్లో అంతే! ఏం జరిగినా పొలిటికల్ సపోర్టు ఉంటుంది. ఏం జరిగినా స్టేషన్ సెటిల్మెంట్ ఉంటుంది. ఏం జరిగినా కే సులు తారుమారు చేసి రాసిన ఎఫ్ ఐ ఆర్ కాగితాలే ఉంటాయి. ఉంటే ఉండనీ ఏం కాదు ప్రజలు మొద్దు నిద్రలో ఉన్నారు. మన మేం చేయలేం. ఉంటే ఉండనీ ఏం కాదు దరిద్రగొట్టు వ్యవస్థలు నిద్రలో ఉన్నాయి. ఏం కాదు. కనుక ఎవరి పని వారు చేయడంలో వస్తున్న వైఫల్యం కారణంగా పోలీసులు హాయిగా ఉన్నారు. అదే సందర్భంలో బాధితులు న్యాయం అని గగ్గోలు పెడితే పట్టించుకో ని వారే ఉన్నారు. ఇప్పుడేం చేయాలి..న్యాయం కావాలి అని మాత్రం నినదించకండి. అది జరగని పని!





పోలీసులూ, పబ్లిక్ వేర్వేరు గా ఉంటారు. పోలీసులూ, పబ్లిక్ ఎడముఖం పెడముఖం అన్న విధంగా ఉంటారు. పోలీసులూ పబ్లిక్ ఎవరి అరాచకం వారే చేస్తుంటారు. పోలీసులూ పబ్లిక్ ఎవరి దారి వారే చూసుకుని హాయిగా సుఖానికి దగ్గరగా ఉంటారు. పోలీసు లూ, పబ్లిక్ రెండు వేర్వేరు వ్యవస్థలు ఆ ఊళ్లో ఉన్నాయి. బాగుంది ఈ రెండూ ఒక్కటే కదా! అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఒకరి నొకరు దూషించే స్థాయి బయటకు రావడం లేదు కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం కొన్ని జరగకూడనివే జరగుతున్నాయి. అయినా అవి ఆగడం లేదు. ఈ ఆగడాలకు హద్దే లేదు. కనుక ఈ ప్రభుత్వంలో స్టేషన్ సెటిల్మెంట్లు ఆగిపోవాలని, సంబంధిత అధికారులు తక్షణమే వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, అవినీతి పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుకోవడం  నిజంగానే నిజంగానే అత్యాశే! కానీ ఆశను వదులుకోవడం భావ్యం కాదు.



- రత్నకిశోర్ శంభుమహంతి







 



మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!

మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>