PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan8007a291-07f3-4d53-bb77-9bd8e93a402f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan8007a291-07f3-4d53-bb77-9bd8e93a402f-415x250-IndiaHerald.jpgఏపీలో ఖాళీగా ఉన్న మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ వార్ వ‌న్ సైడ్ చేసేసింది. మొత్తం నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు 12 న‌గ‌ర పంచాయ‌తీ లు , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీలో మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. ఇక కృష్నా జిల్లాలోని కొండ ప‌ల్లిలో కూడా టీడీపీ త‌న ఆధిక్య‌త నిలుపు కుంది. అయితే ఇక్క‌డ మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎంపిక జ‌రిగే వ‌ర‌కు కూడా ఈ మున్సిపాల్టీ టీడీపీ నిలుపు కుంటుందా ? లేదా ? అన్న‌ది చూడాల్సి ఉందJanasena{#}Nellore;Congress;District;Guntur;Andhra Pradesh;YCP;TDP;Partyఏపీ లోక‌ల్ వార్‌లో జ‌న‌సేన ఎక్క‌డ‌...!ఏపీ లోక‌ల్ వార్‌లో జ‌న‌సేన ఎక్క‌డ‌...!Janasena{#}Nellore;Congress;District;Guntur;Andhra Pradesh;YCP;TDP;PartyThu, 18 Nov 2021 10:58:01 GMTఏపీలో ఖాళీగా ఉన్న మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ వార్ వ‌న్ సైడ్ చేసేసింది. మొత్తం నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు 12 న‌గ‌ర పంచాయ‌తీ లు , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీలో మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. ఇక కృష్నా జిల్లాలోని కొండ ప‌ల్లిలో కూడా టీడీపీ త‌న ఆధిక్య‌త నిలుపు కుంది. అయితే ఇక్క‌డ మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎంపిక జ‌రిగే వ‌ర‌కు కూడా ఈ మున్సిపాల్టీ టీడీపీ నిలుపు కుంటుందా ?  లేదా ? అన్న‌ది చూడాల్సి ఉంది.

ఇక నెల్లూరు కార్పోరేష‌న్లో అయితే టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అక్క‌డ ఒక్క వార్డు కూడా గెల‌వ‌లేదు. ఇది లా ఉంటే ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అడ్ర‌స్ అయితే చాలా చోట్ల గ‌ల్లంతు అయ్యింది. పోటీ అంతా వైసీపీ వ‌ర్సెస్ , టీడీపీ మ‌ధ్యే సాగింది. అస‌లు మూడో పార్టీకి ఇక్క‌డ స్కోప్ లేదు. జ‌న‌సేన తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు పూర్తిగా చేతులు ఎత్తేశాయి.

ఇక జ‌న‌సేన గుంటూరు జిల్లాలో ని గుర‌జాల న‌గ‌ర పంచాయ‌తీలోని 13వ వార్డులో గెలిచింది. ఇక దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ తీలో 8వ వార్డులో మాత్ర‌మే ఆ పార్టీ అభ్య‌ర్థి గెలిచింది. ఉన్నం త లో గొప్ప విష‌యం ఏంటంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడు న‌గ‌ర పంచాయ‌తీ లో టీడీపీ తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన మొత్తం 5 వార్డుల్లో పోటీ చేసింది.

ఇక్క‌డ నుంచి మూడు చోట్ల ఆ పార్టీ అభ్య‌ర్థులు గెలిచారు. అది కూడా టీడీపీ తో పొత్తు ఉన్నందునే అంటున్నారు. ఇక మిగిలిన చోట్ల ఎక్క‌డా జ‌న‌సేన గెల‌వ‌లేదు. దీనిని బ‌ట్టి ఏపీ లో జ‌న‌సేన ప్ర‌భావం ఏ మాత్రం లేద‌న్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది.



మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>