PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff433e62-e157-473f-a15f-6881b55bf579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff433e62-e157-473f-a15f-6881b55bf579-415x250-IndiaHerald.jpgస్పందన ... ఆంధ్ర ప్రదేశ్ లో ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రతి సోమ వారం నిర్వహీంచే అర్జీల స్వీకరణ కార్యక్రమం. ఈ కార్యక్రమ అమలును సాక్షాత్తు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సమీక్షీస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అర్జీలపై ఆయన స్పందించారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.. అదేంటో తెలుసా ?jagan{#}dr rajasekhar;Parliment;E-mail;monday;Qualification;Application;Jagan;Telangana Chief Minister;Andhra Pradesh;Government;District'స్పందన' కు స్పందించిన జగన్'స్పందన' కు స్పందించిన జగన్jagan{#}dr rajasekhar;Parliment;E-mail;monday;Qualification;Application;Jagan;Telangana Chief Minister;Andhra Pradesh;Government;DistrictThu, 18 Nov 2021 13:08:09 GMT
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో స్పందన కార్యక్రమం కూడా ఒకటి. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలంచారు. అయితే గత కొద్ది మాసాలుగా ఈ కార్యక్రమం అంత సజావుగా జరగడం లేదు. ఇదే విషయాన్ని ఆయన పార్టీకి చెందిన అసమ్మతి పార్లమెంట్ సభ్యుడు రఘారామ కృష్టంరాజు చాలా సార్లు ముఖ్యమంత్రిని పత్రికా ముఖంగా ప్రశ్నించారు కూడా. ఆ విషయాన్ని, వారిద్దరి మధ్య ఉన్న విబేధాలను కాసేపు  పక్కన పెడదాం.
స్పందన కార్యక్రమం... ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కరించేందుకు  ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో.... అంటే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అన్న ప్రభుత్వ శాఖల లోనూ అర్జీలు స్వీకరించే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన  పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో అర్జీల స్వీకరణ కార్యక్రమం పురుడు పోసుకుంది. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఇదే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ  కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని తలంచారు.  అర్జీల స్వీకరణ కార్యక్రమానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు.  స్పందన అని ఆ కార్యక్రమానికి నామకరణం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి  క్రమం తప్పకుండా ఈ కార్యక్రమ పనితీరును స్వయంగా సమీక్షిస్తున్నారు.  తన సమీక్షలలో వచ్చిన ఇన్ పుట్ ల ఆధారంగా  కాలానికి అనుగుణంగా టోల్ ఫ్రీ నంబర్ ను, ఈ మెయిల్ ను అందబాటు లోకి తీసుకువచ్చారు. కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇవ్వలేని ఫిర్యాదు దారులు  టోల్ ఫ్రీ నంబర్ కు గానీ, ఈ మెయిల్  ద్వారా కానీ తమ విజ్ఞప్తులను సమర్పించ వచ్చు.
 ఇటీవలి కాలంలో  స్పందన కార్యక్రమానికి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను క్రమం తప్పకుండా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్జి దృష్టికి ఓ ప్రధాన మైన విషం వచ్చింది. అదే ఫించన్ ల సమస్య. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలలో చాలా మంది ఫించను దార్ల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో వారు తమకు ఫించన్ మంజూరు చేయాలని స్పందనలో దరఖాస్తు చేశారు. స్పందనకు వచ్చిన దరఖాస్తుల్లో ఇవే అధికంగా ఉన్నాయి. తాము ప్రభుత్వ పింఛన్ అందుకునేందుకు అర్హులమని, తమ పేరు ను జాబితా నుంచి తీసివేశారని పలువురు  స్పందన లో వాపోయారు.
దీంతో ముఖ్యమంత్రి స్పందించారు. జాబితా నుంచి ఫించను దార్ల పేర్లు గల్లంతవడం ఏమిటని అధికారులను నిలదీశారు. పింఛన్ దార్ల జాబితా లో పేర్లు లేని వారు  మరలా తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సచివాలయాల పోర్టల్ లలో దరఖాస్తులు తిరస్కరణకు గురై, అర్హత ఉన్న  ఉన్న వారు  మరలా ఫించను కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. వీటిని వివిధ స్థాయిల్లో అంటే.. మున్సిపల్ కమీషనర్, ఎం.పిడిఓ, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు పరిళీంచి అర్హులకు ఫించన్ అందేలా చూస్తారని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కోంది.






నయనతార కు ప్రభుదేవా ఫోన్...?

బ్రేకింగ్: అమిత్ షా క్లాస్ తో లైన్లోకి వచ్చిన సోము

క‌ర్ష‌కుడా.. క‌ద‌లిరా..! కాంగ్రెస్ ఆందోళ‌న

టిటిడి కార్తీక దీపోత్సవం వాయిదా

తెలంగాణ‌లోనే వ‌రిలో నెంబ‌ర్ వ‌న్ న‌ల్ల‌గొండ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>