PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-19439126-a294-4693-98cf-3b0405c29242-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-19439126-a294-4693-98cf-3b0405c29242-415x250-IndiaHerald.jpgదిశగా అడుగులు వేస్తున్నారట. అయితే ఆపరేషన్ ఆకర్ష్ ని విజయవంతంగా పూర్తి చేయడానికి విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట. రెండో విడత ఆకర్ష్ లో భాగంగా బిజెపి, టిడిపి నుంచి ముఖ్య నాయకులు కొందరు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష టీడీపీ దుకాణం ఖాళీ అవుతుందంటూ హింట్ ఇస్తూ టిడిపి ముఖ్య నాయకులు తమతో టచ్ లో ఉన్నారని చెబుతూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందట. వారిలో ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి విజయసాయి విన్నింగ్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌటPolitical {#}GEUM;Uttarandhra;Vishakapatnam;Party;Success;TDP;local language;YCPవిశాఖపై కన్నేసిన జగనన్న.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!విశాఖపై కన్నేసిన జగనన్న.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!Political {#}GEUM;Uttarandhra;Vishakapatnam;Party;Success;TDP;local language;YCPThu, 18 Nov 2021 13:05:00 GMTఅధికార వైసీపీ ఉత్తరాంధ్రలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా..? ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ విజయసాయిరెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారా..?  అసలు ఆపరేషన్ ఆకర్ష్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? విశాఖ లో స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ కి మరోసారి శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు పార్టీ మారి దూరంగా ఉన్న నేతలను మళ్లీ వైసిపి గూటికి ఆహ్వానిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం వరకు పదవులను చేజిక్కించుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నించి సక్సెస్ అవడంతో అధినేత ఆదేశాల మేరకు నాయకత్వం పావులు కదుపుతోంది.

 గ్రామాల్లో విపక్షాలకు చెందిన బలమైన నాయకులు స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులను వైసీపీలో చేర్చడానికి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టి విజయం సాధించారు. కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న విశాఖలో రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు వైసిపి గత ఏడాది నుంచే స్కెచ్ లు వేయడం మొదలు పెట్టింది. ముందుగా విశాఖ డైరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్,వెలగపూడి రామకృష్ణ, గణబాబు పై ఆపరేషన్ ఆకర్ష్  అస్త్రాన్ని ప్రయోగించింది. అంతేకాదు గతంలో టికెట్ ఆశించి భంగపడి ఇతర పార్టీలకు వెళ్ళిన కొందరు నాయకులను వైసిపి గూటికి తెచ్చే పనిలో పడ్డారు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ విజయసాయిరెడ్డి. విశాఖలో పార్టీ బలోపేతాన్ని తన భుజాలపై వేసుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. అయితే ఆపరేషన్ ఆకర్ష్ ని విజయవంతంగా పూర్తి చేయడానికి విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట.

రెండో విడత ఆకర్ష్ లో భాగంగా బిజెపి, టిడిపి నుంచి  ముఖ్య నాయకులు కొందరు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష టీడీపీ దుకాణం ఖాళీ అవుతుందంటూ హింట్ ఇస్తూ టిడిపి ముఖ్య నాయకులు తమతో టచ్ లో ఉన్నారని చెబుతూ  వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందట. వారిలో ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి విజయసాయి విన్నింగ్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.



'స్పందన' కు స్పందించిన జగన్

క‌ర్ష‌కుడా.. క‌ద‌లిరా..! కాంగ్రెస్ ఆందోళ‌న

టిటిడి కార్తీక దీపోత్సవం వాయిదా

తెలంగాణ‌లోనే వ‌రిలో నెంబ‌ర్ వ‌న్ న‌ల్ల‌గొండ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>