PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp98814160-e155-4765-bf07-fc5b52f4cebc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp98814160-e155-4765-bf07-fc5b52f4cebc-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలమైన నియోజకవర్గం కాదని మరొకసారి రుజువైంది. గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు మున్సిపాలిటీల్లో వైసీపీ హవా నడిచింది. గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే మొదట నుంచి గురజాల నియోజకవర్గం టీడీపీకి అనుకూలమైన స్థానం కాదు. tdp{#}KASU MAHESH REDDY;Piduguralla;Yerapathineni Srinivasa Rao;Gurazala;Kamma;Janasena;Cheque;District;Telugu Desam Party;Jagan;YCP;TDPఆ కమ్మ నేతకు..రెడ్డి ఎమ్మెల్యే మళ్ళీ ఛాన్స్ ఇచ్చేలా లేరుగా!ఆ కమ్మ నేతకు..రెడ్డి ఎమ్మెల్యే మళ్ళీ ఛాన్స్ ఇచ్చేలా లేరుగా!tdp{#}KASU MAHESH REDDY;Piduguralla;Yerapathineni Srinivasa Rao;Gurazala;Kamma;Janasena;Cheque;District;Telugu Desam Party;Jagan;YCP;TDPThu, 18 Nov 2021 04:00:00 GMTగుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలమైన నియోజకవర్గం కాదని మరొకసారి రుజువైంది. గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు మున్సిపాలిటీల్లో వైసీపీ హవా నడిచింది. గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే మొదట నుంచి గురజాల నియోజకవర్గం టీడీపీకి అనుకూలమైన స్థానం కాదు.

ఇక్కడ టీడీపీ నాలుగుసార్లు మాత్రమే గెలిచింది. 1985, 1994, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే మూడుసార్లు యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలుస్తూ వచ్చారు. కమ్మ వర్గానికి చెందిన యరపతినేని ఊహించని విధంగా గురజాలలో బలపడ్డారు. దీంతో ఆయనకు చెక్ పెట్టడం అంత సులువు కాదని అంతా అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఊహించని విధంగా యరపతినేనిపై కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా గెలిచాక గురజాలలో కాసు హవానే నడుస్తోంది. ఏ మాత్రం యరపతినేనికి ఛాన్స్ ఇవ్వకుండా కాసు దూసుకెళుతున్నారు. ఇప్పటికే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో యరపతినేనికి చెక్ పెట్టారు. అలాగే పిడుగురాళ్ల మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ చేశారు. ఈ మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క వార్డు రాలేదు. ఇక తాజాగా జరిగిన గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కాకపోతే దాచేపల్లిలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ 20 వార్డులు ఉంటే వైసీపీ 11, టీడీపీ 7, జనసేన 1, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు. అంటే ఎడ్జ్‌లో దాచేపల్లిని వైసీపీ కైవసం చేసుకుంది.

అటు గురజాలలో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. 20 వార్డుల్లో వైసీపీ 16, టీడీపీ 3, జనసేన 1 చోట విజయం సాధించింది. అంటే ఇలా ప్రతి ఎన్నికల్లోనూ గురజాలలో వైసీపీ హవా నడిచింది. ఇదే హవా నెక్స్ట్ ఎన్నికల వరకు కంటిన్యూ అయితే మళ్ళీ యరపతినేనికి కాసు గెలిచే ఛాన్స్ ఇవ్వకపోవచ్చని చెప్పొచ్చు.  



ఆ కమ్మ నేతకు..రెడ్డి ఎమ్మెల్యే మళ్ళీ ఛాన్స్ ఇచ్చేలా లేరుగా!

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>