PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naxalse2c60924-f75c-4820-bcaf-5aab15d350b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naxalse2c60924-f75c-4820-bcaf-5aab15d350b1-415x250-IndiaHerald.jpgభారత దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో వామ పక్ష తీవ్రవాదం ఒకటి. నక్సలైట్లు పేదల కోసం పని చేస్తారు.. అన్న భావజాలం జనంలోనూ ఉంది. కానీ.. వారు తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్లి.. విప్లవ బాటలో పయనిస్తామంటారు. కానీ.. దీన్ని చట్టం ఒప్పుకోదు. అంతే కాదు.. నక్సల్స్ పేరుతో సూడో నక్సలైట్లు రెచ్చిపోతుంటారు కూడా. అందుకే నక్సలైట్ల కట్టడి కోసం కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే.. అన్నల బలమంతా అడవుల్లోనే ఉంటుంది. నక్సలైట్లకు అడవులు కొట్టిన పిండి. అడవుల్లో అందులోనూ దండకారణ్యాల్లో వారు బస చేస్తుంటారు. naxals{#}Prime Ministerఅన్నలకు చెక్‌ చెప్పేందుకు కేంద్రం మాస్టర్‌ ప్లాన్..?అన్నలకు చెక్‌ చెప్పేందుకు కేంద్రం మాస్టర్‌ ప్లాన్..?naxals{#}Prime MinisterThu, 18 Nov 2021 00:00:00 GMTభారత దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో వామ పక్ష తీవ్రవాదం ఒకటి. నక్సలైట్లు పేదల కోసం పని చేస్తారు.. అన్న భావజాలం జనంలోనూ ఉంది. కానీ.. వారు తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్లి.. విప్లవ బాటలో పయనిస్తామంటారు. కానీ.. దీన్ని చట్టం ఒప్పుకోదు. అంతే కాదు.. నక్సల్స్ పేరుతో సూడో నక్సలైట్లు రెచ్చిపోతుంటారు కూడా. అందుకే నక్సలైట్ల కట్టడి కోసం కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే.. అన్నల బలమంతా అడవుల్లోనే ఉంటుంది.


నక్సలైట్లకు అడవులు కొట్టిన పిండి. అడవుల్లో అందులోనూ దండకారణ్యాల్లో వారు బస చేస్తుంటారు. అడవుల్లోని మూల మూలల్లోనూ.. వారికి సంబంధాలు ఉంటాయి. అడవుల్లోని గిరిజనులు కాస్త వారికి అండదండలుంటాయి. అయితే నక్సలైట్లను కట్టడి చేయడం కోసం కేంద్రం అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇందులో తాజాగా 6 వేల కోట్ల రూపాయలతో ఓ ప్లాన్ రచించింది. దీన్ని ఐదు రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నారు. ఈ నిధులతో మొబైల్‌ టవర్లను అనుసంధానిస్తారు.


ఐదు రాష్ట్రాల్లోని 44 జిల్లాలు 7 వేల గ్రామాల్లో టవర్లను అనుసంధానించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లో టవర్ల అనుసంధానిస్తారు. ఈ ప్రాంతాల్లో 4జీ మొబైల్‌ సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,466 కోట్లుగా కేంద్రం భావిస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రోడ్ల నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. అలాగే గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తారు. అడవులు, పర్వతాలు, నదుల మీదుగా రోడ్ల నిర్మాణం చేపడతారు.


ఈ చర్యల ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ చొచ్చుకు వెళ్లవచ్చని కేంద్రం భావిస్తోంది. దండకారణ్యంలో ఇప్పటి వరకూ నక్సల్స్ ఉండటానికి కారణం.. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు అంత బాగా అభివృద్ధి కాకపోవడమే. అందుకే ఆ లోపాలు అధిగమించి అన్నలను కట్టడి చేయాలని కేంద్రం ఈ వ్యూహం రచిస్తోంది.





టీడీపీ టఫ్ ఫైట్: వైసీపీకి కాస్త కష్టమైనట్లే ఉంది...!

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>