MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/radhesyam-movie-gossip38fee36b-dc6a-4344-990f-e0df3a09c73d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/radhesyam-movie-gossip38fee36b-dc6a-4344-990f-e0df3a09c73d-415x250-IndiaHerald.jpgరాధేశ్యామ్ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మూవీ తెలుగులో రూపు దిద్దుకుంటున్నప్పటికీ హిందీ, తమిళ్, కన్నడ ఇలా పలు భాషల్లోనూ డబ్ కానుంది. ప్రభాస్ కి ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇతర భాషల్లోనూ అభిమాన గణాన్ని అమాంతం పెంచేస్తున్నారు.RADHESYAM-MOVIE-GOSSIP{#}deepika;Darling;Bahubali;Kannada;Audience;bollywood;tara;Prabhas;January;Cinema;India;Telugu"రాధేశ్యామ్"లో దీపికా పదుకునే... నిజమేనా?"రాధేశ్యామ్"లో దీపికా పదుకునే... నిజమేనా?RADHESYAM-MOVIE-GOSSIP{#}deepika;Darling;Bahubali;Kannada;Audience;bollywood;tara;Prabhas;January;Cinema;India;TeluguThu, 18 Nov 2021 21:30:00 GMTరాధేశ్యామ్ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మూవీ తెలుగులో రూపు దిద్దుకుంటున్నప్పటికీ హిందీ, తమిళ్, కన్నడ ఇలా పలు భాషల్లోనూ డబ్ కానుంది. ప్రభాస్ కి ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇతర భాషల్లోనూ అభిమాన గణాన్ని అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా అందులో తొలుత రాధేశ్యామ్ మూవీ విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

దాంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపే వాళ్ళు కూడా లేకపోలేదు. అంతటి ప్రేక్షక అభిమానాన్ని కూడగట్టుకున్నారు రెబల్ స్టార్.  అయితే ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుండి వినిపిస్తున్న ఓ తాజా వార్త అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఈ న్యూస్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార దీపిక పదుకునే గెస్ట్ రోల్ చేస్తున్నారట. మొదట ఈ పాత్ర కోసం తెలుగు అగ్ర నటులను అనుకున్నా ఆ తరవాత దీపిక అయితే ఇటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా  కనెక్ట్ అయ్యి సినిమాకి బాగా ప్లస్ అవుతారని ఇలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

దాదాపు పావు గంటకు పైనే ఈమె పాత్ర ఉండనుంది అంటూ టాక్ వినిపిస్తోంది. నిడివి తక్కువే అయినా మూవీని ఒక మలుపు తిప్పే పాత్రలో దీపిక కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వార్తను బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా లీక్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో రాధేశ్యామ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ  దీపిక కనిపించనున్నారా అంటే పూర్తి వివరాలు తెలిసే వరకు వెయిట్ చేయాల్సిందే.



కొత్త వ్యవసాయ చట్టాలతో అనర్థమేనా.. రైతు బజార్ల పరిస్థితి ఏంటి..?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>