MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-do-you-know-why-nayantara-is-not-doing-telugu-moviesb7937d9c-f019-412f-82eb-578ca21953bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-do-you-know-why-nayantara-is-not-doing-telugu-moviesb7937d9c-f019-412f-82eb-578ca21953bb-415x250-IndiaHerald.jpgనయనతార మాట మార్చింది. అప్పుడు ఒకమాట.. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతోంది. అక్కడి వెళ్లనని చెప్పి.. ఇప్పుడు అక్కడికే వెళ్లిపోయింది. మళ్లీ ఇక్కడి మొహం చూడటం లేదు. ఇదే ఆమె అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తుందా..? చూడదా..? అనేదే పెద్ద సందేహం. Do you know why Nayantara is not doing Telugu movies{#}atlee kumar;Hindi;marriage;News;bollywood;nayantara;Telugu;Cinemaనయనతార తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదో తెలుసా..?నయనతార తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదో తెలుసా..?Do you know why Nayantara is not doing Telugu movies{#}atlee kumar;Hindi;marriage;News;bollywood;nayantara;Telugu;CinemaThu, 18 Nov 2021 11:00:00 GMTనయనతార ఎప్పుడు అడిగినా హిందీ సినిమాలు చేయను అనే సమాధానమిచ్చేది. ముంబయికి ముఖమే చూడను అనే ఆన్సర్ ఇచ్చేది. కానీ ఉన్నట్టుండి బాలీవుడ్ లో వాలిపోయింది. సూపర్‌ స్టార్డమ్‌ అందించిన తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు. మరి నయన్‌ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయిందోనని ఆమె అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆమె ఎందుకు అలా అయిపోయిందోనని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

నయనతార 'సైరా' సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. ఈ మూవీకి 3 కోట్లకు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకున్నా, బెస్ట్ పెర్ఫామర్ అని మేకర్స్‌ కూడా స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తోన్నా, నయన్ మాత్రం తెలుగు సినిమాలకి సైన్ చెయ్యట్లేదు. హీరోయిజం చుట్టూ తిరుగుతోన్న కథల్లో నటించనని, తమిళ్, మళయాళంనే ప్రిఫర్ చేస్తోంది. హిందీకి కూడా వెళ్తోంది గానీ తెలుగుని పట్టించుకోవడం లేదు.

నయనతార రీసెంట్‌గానే బాలీవుడ్‌కి వెళ్లింది. అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఒక సినిమా చేస్తోంది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నయన్ క్యారెక్టర్ సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే నయన్‌ ఈ సినిమాకి కమిట్‌ అయిందని తెలుస్తోంది.

నయనతార ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం దాటింది. సీనియర్ హీరోయిన్‌ స్టేటస్వచ్చింది. ఇలాంటి టైమ్‌లో కూడా రెగ్యులర్ కమర్షియల్‌ మూవీస్‌ ఏంటని ఫీలవుతోందట నయన్. అందుకే హీరోయిన్‌కి ఇంపార్టెన్స్‌ ఉన్న సినిమాలకే సైన్ చేస్తోంది. హీరోయిన్లకి ప్రాధాన్యత ఉంటుందని తమిళ్‌, మళయాళీ మూవీస్‌తో బిజీ అయిపోతోంది.

మొత్తానికి నయనతార తెలుగు సినిమాల వైపు చూస్తుందా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది. మరోవైపు నయన త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు వీలైనంత త్వరగా అత్తారింటిలో అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరుకుటుంబాలు కలిపోయాయి కూడా. నయన తనకు కాబోయే భర్తను తన ఇంటికి కూడా తీసుకెళ్లింది.







టీడీపీ నంద‌మూరికే ఇచ్చేయాలి.. మ‌రోసారి అదే డిమాండ్‌..!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>