PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan9cc328fe-270f-4b59-8049-fe4bbc124027-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan9cc328fe-270f-4b59-8049-fe4bbc124027-415x250-IndiaHerald.jpgఏపీ లోక‌ల్ వార్ లో జ‌న‌సేన డ‌బ్బాలు మూగ‌బోయాయి. నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు ఖాళీ గా ఉన్న 12 న‌గ‌ర పంచాయ‌తీ లు , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు జ‌రిగిన మున్సిపాల్టీ ల కౌంటింగ్ నిన్న జ‌రిగింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం ఎక్క‌డా లేదు. నెల్లూరు లో బ‌లిజ ఓట‌ర్లు ఉన్నా కూడా ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం ఏ మాత్రం లేదు. ఇక ఏపీ లో ఈ మార్చి లో జ‌రిగిన పంచాయ‌తీ, ఎంపీటీసీ , జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మంచి ప్ర‌భావం చూపించింది.అప్పుడు జ‌న‌సేన వాల్లు మామూలుగా డ‌బ్బాలు కొట్టుకోలేదు. 1209 స‌ర్పంJanasena{#}naina;March;Nellore;war;District;Guntur;Andhra Pradesh;Partyజ‌న‌సేన డ‌బ్బాలు ఎందుకు మూగ‌బోయాయ్‌..!జ‌న‌సేన డ‌బ్బాలు ఎందుకు మూగ‌బోయాయ్‌..!Janasena{#}naina;March;Nellore;war;District;Guntur;Andhra Pradesh;PartyThu, 18 Nov 2021 11:05:00 GMTఏపీ లోక‌ల్ వార్ లో జ‌న‌సేన డ‌బ్బాలు మూగ‌బోయాయి. నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు ఖాళీ గా ఉన్న 12 న‌గ‌ర పంచాయ‌తీ లు , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు జ‌రిగిన మున్సిపాల్టీ ల కౌంటింగ్ నిన్న జ‌రిగింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం ఎక్క‌డా లేదు. నెల్లూరు లో బ‌లిజ ఓట‌ర్లు ఉన్నా కూడా ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం ఏ మాత్రం లేదు. ఇక ఏపీ లో ఈ మార్చి లో జ‌రిగిన పంచాయ‌తీ, ఎంపీటీసీ , జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మంచి ప్ర‌భావం చూపించింది.

అప్పుడు జ‌న‌సేన వాల్లు మామూలుగా డ‌బ్బాలు కొట్టుకోలేదు. 1209 స‌ర్పంచ్‌లు, 1576 ఉప స‌ర్పంచ్‌లు, 4456 వార్డులు గెలిచామ‌ని నానా హ‌డావిడి చేయ‌డంతో పాటు ఆ ఎన్నిక‌ల్లో 27 శాతం ఓట్లు పార్టీ త‌ర‌పున పోటీలో ఉన్న వాళ్ల‌కు వ‌చ్చాయ‌ని.. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా చెప్పారు. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిన మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ 177 స్థానాల్లో గెలిచింది.

అప్పుడు కూడా త‌మ‌కు ఏకంగా 25 శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని ఆ పార్టీ నేత‌లు డ‌బ్బాలు కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. గుంటూరు జిల్లాలో రెండు కౌన్సెల‌ర్ సీట్లు.. అటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడు లో మ‌రో మూడు సీట్లు.. అది కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని మాత్ర‌మే గెలిచింది. ఏదేమైనా ఈ ఫ‌లితాలు జ‌న‌సేన కేడ‌ర్ కు ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక నైనా జ‌నాల్లోకి వ‌చ్చి పార్టీని బ‌లోపేతం చేస్తే త‌ప్పా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీలో కేడ‌ర్ ఎవ్వ‌రూ మిగ‌ల‌ర‌నే అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ సినిమాలు ప‌క్క‌న పెట్టేసి జ‌నాల్లోకి వ‌స్తారా ?  లేదా జ‌న‌సేన‌ను అలా వ‌దిలేస్తారా ? అన్న‌ది చూడాలి.



మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>