PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunu-teesulurandi-chudalani-undi8de4bac7-ee19-402d-9564-0788c0fd4abc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunu-teesulurandi-chudalani-undi8de4bac7-ee19-402d-9564-0788c0fd4abc-415x250-IndiaHerald.jpgతాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ - 12 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు నిన్న వెల్లడి అయ్యాయి. మరోసారి అధికార వైసిపి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొద్దిరోజులుగా కుదిపేస్తున్న అమరావతి రాజధాని అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేరకు ప్రభావం చూపించిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజధాని జిల్లాలు కృష్ణా - గుంటూరు తో పాటు ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రకాశం జిల్లాలోని ద‌ర్శి నగర Jagan{#}Jaggayyapeta;Gurazala;Amaravati;Amaravathi;Panchayati;Nellore;krishna;Guntur;Prakasam;Capital;local language;Andhra Pradesh;Krishna River;Telugu Desam Party;YCP;Party;Electionsవైసీపీకి రాజ‌ధాని ఎఫెక్ట్ ప‌డిందిగా...!వైసీపీకి రాజ‌ధాని ఎఫెక్ట్ ప‌డిందిగా...!Jagan{#}Jaggayyapeta;Gurazala;Amaravati;Amaravathi;Panchayati;Nellore;krishna;Guntur;Prakasam;Capital;local language;Andhra Pradesh;Krishna River;Telugu Desam Party;YCP;Party;ElectionsThu, 18 Nov 2021 12:15:00 GMTతాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ - 12 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు నిన్న వెల్లడి అయ్యాయి. మరోసారి అధికార వైసిపి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొద్దిరోజులుగా కుదిపేస్తున్న అమరావతి రాజధాని అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేరకు ప్రభావం చూపించిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజధాని జిల్లాలు కృష్ణా - గుంటూరు తో పాటు ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రకాశం జిల్లాలోని ద‌ర్శి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

ఇక ఇక కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట - కొండపల్లి మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ కి గట్టి పోటీ ఇచ్చింది. జగ్గయ్యపేటలో ఒకానొక ద‌శ లో గెలుపు వరకు వెళ్లి వైసీపీకి ముచ్చెమటలు పట్టించింది. ఇక కొండ‌ప‌ల్లి లో తెలుగుదేశం పార్టీ తన జెండా ఎగురవేసింది. దీంతోపాటు అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలోనూ వైసీపీ కి చేదు ఫలితాలు తప్పలేదు. గుంటూరు నగరంలో సిట్టింగ్ కార్పొరేటర్ స్థానాన్ని వైసిపి కోల్పోయింది.

దీంతోపాటు ఎన్నికలు జరిగిన దాచేపల్లి - గురజాల నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఫలితాలు విశ్లేషిస్తున్న వారు రాజధాని ప్రభావం మూడు జిల్లాల్లోనూ వైసీపీపై గట్టిగా పడిందని అంటున్నారు. ఇప్పటికే రాజ‌ధాని వికేంద్రీ క‌ర‌ణ తో ఈ మూడు జిల్లాల్లో భూముల ధరలు పడిపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు రావడంతో ఇక్క‌డ చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కొంత వ‌ర‌కు చూపించారు.

ఇక అమ‌రావ‌తి ఉద్య‌మం జోరుగా జ‌రుగుతూ ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దీని ప్ర‌భావం మ‌రిం త గ‌ట్టిగా ఉంటుంద‌ని కూడా చెపుతున్నారు. మ‌రి ఈ లోగా జ‌గ‌న్ రాజ‌ధాని పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి.

 



కుప్పం-ద‌ర్శి పోలిక బాగుంది.. మ‌రి మిగిలిన వాటి సంగ‌తో...!

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!

మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>