MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nayanatara-bc718862-ee48-40d0-a85d-bd5e1d8e05b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nayanatara-bc718862-ee48-40d0-a85d-bd5e1d8e05b7-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ నయనతార విపరీతమైన ప్రజాదరణ పొందిన దక్షిణ భారత నటి అన్న విషయం తెలిసిందే. ఈ రోజు నవంబర్ 18న ఆమె పుట్టినరోజు. ఈ అందమైన నటి ఇప్పటికే మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో కలిపి 75 చిత్రాలకు పైగా నటించి తనకు తానుగా లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఏకైక మహిళా నటి నయన్. ఆమె ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా 'లేడీ సూపర్ స్టార్' ట్యాగ్ వచ్చేసింది. తమిళంలో అయ్య, తెలుగులో లక్ష్మీ చిత్రాలతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న HBD Nayanatara;{#}Balakrishna;jyothika;surender reddy;CBI;Thriller;Lakshmi Devi;Music;vijay sethupathi;November;Rajani kanth;Chitram;nayana harshita;nayantara;Telugu;Tamil;Cinemaలేడీ సూపర్ స్టార్ టాప్ 6 మూవీస్... ఎన్ని సార్లైనా చూసేయొచ్చు !లేడీ సూపర్ స్టార్ టాప్ 6 మూవీస్... ఎన్ని సార్లైనా చూసేయొచ్చు !HBD Nayanatara;{#}Balakrishna;jyothika;surender reddy;CBI;Thriller;Lakshmi Devi;Music;vijay sethupathi;November;Rajani kanth;Chitram;nayana harshita;nayantara;Telugu;Tamil;CinemaThu, 18 Nov 2021 10:36:01 GMTలేడీ సూపర్ స్టార్ నయనతార విపరీతమైన ప్రజాదరణ పొందిన దక్షిణ భారత నటి అన్న విషయం తెలిసిందే. ఈ రోజు నవంబర్ 18న ఆమె పుట్టినరోజు. ఈ అందమైన నటి ఇప్పటికే మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో కలిపి 75 చిత్రాలకు పైగా నటించి తనకు తానుగా లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఏకైక మహిళా నటి నయన్. ఆమె ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా 'లేడీ సూపర్ స్టార్' ట్యాగ్ వచ్చేసింది. తమిళంలో అయ్య, తెలుగులో లక్ష్మీ చిత్రాలతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ప్రముఖ స్టార్ ఒకరు. ఆమె పుట్టిన రోజు ప్రత్యేక సందర్భంగా ఈరోజు నయనతార టాప్ 6 ఉత్తమ చిత్రాలు ఏంటో చూద్దాం.

పుతీయ నియమం
ఏకే సాజన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీలో నయనతార కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఒకటి. ఆమె అసాధారణమైన బాడీ లాంగ్వేజ్, వాసుకిగా స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా కథాంశాన్ని ఎలివేట్ చేసింది. ఆమె పవర్ ప్యాక్డ్ నటనకు ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది.

చంద్రముఖి
భారీ కమర్షియల్ విజయాన్ని రుచి చూసిన, నయనతార అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఇది ఒకటి. పి. వాసు దర్శకత్వంలో రజనీకాంత్, జ్యోతిక కూడా నటించిన ఈ ఐకానిక్, అతీంద్రియ భయానక చిత్రంలో ఆమె సంగీతం టీచర్ పాత్రను పోషించింది. జర్మన్ భాషలో డబ్ అయిన తొలి తమిళ చిత్రం ఇదే.

సింహా
ఇది నయనతార  మరొక సూపర్‌ హిట్ చిత్రం. ఇక్కడ ఆమె ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ముఖ్యంగా నయనతార, నందమూరి బాలకృష్ణ మధ్య కెమిస్ట్రీ, మాస్‌కు ఈ చిత్రం బాగా నచ్చింది. 2010లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఇది ఒకటి.

శ్రీ రామరాజ్యం
బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. నయనతార సీత పాత్రలో అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గానూ ఆమెకు నంది అవార్డు వచ్చింది.

సైరా నరసింహా రెడ్డి
ఈ చారిత్రాత్మక యాక్షన్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నటించింది. ఈ మూవీ అద్భుతమైన నటిగా నయనతార స్థానాన్ని బలోపేతం చేసింది. ఇది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన బయోపిక్. ఇందులో చిరంజీవి, విజయ్ సేతుపతి కూడా నటించారు. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళంలో డబ్ అయ్యింది.

ఇమైక్క నొడిగల్
నయనతార సినిమాల్లోని అన్ని జోనర్‌లలో తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటూనే ఉంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో ఆమె పూర్తి నమ్మకంతో ఉండే సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషించింది. అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ చిత్రం నయనతార మరొక బ్లాక్‌బస్టర్ చిత్రంగా మారింది.





లేడీ సూపర్ స్టార్ టాప్ 6 మూవీస్... ఎన్ని సార్లైనా చూసేయొచ్చు !

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!

సిగ్గుపడాల్సిందే: లంచాల మేతలో మనమే టాప్..

హాట్ టాపిక్‌గా కృష్ణా టీడీపీ కీల‌క నేత దూకుడు ..!

నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..!

ఫలితాలపై పవన్ మౌనం.. అసలు సంగతేంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>