PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunu-teesulurandi-chudalani-undi8de4bac7-ee19-402d-9564-0788c0fd4abc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunu-teesulurandi-chudalani-undi8de4bac7-ee19-402d-9564-0788c0fd4abc-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేనికి కూడా భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏ విషయమైనా సరే... వెనుకడుగు వేసేది లేదని తేల్చేశారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే.... అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే... సూటిగా దూసుకెళ్తున్న వ్యక్తిగా వైఎస్ జగన్‌కు పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మాట ఇస్తున్నా... ఇచ్చిన మాట తప్పను అని ఓటర్లకు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత... ముందుగా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టిన వైఎస్ జగన్... ఆ తర్వాత తనదైన దూకుడు నిర్ణయాలతో దJagan{#}Jagan;Assembly;Telangana Chief Minister;Congress;Coronavirus;Hanu Raghavapudi;Dookudu;Governmentప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన జగన్... అందుకే అలా...!ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన జగన్... అందుకే అలా...!Jagan{#}Jagan;Assembly;Telangana Chief Minister;Congress;Coronavirus;Hanu Raghavapudi;Dookudu;GovernmentThu, 18 Nov 2021 13:15:06 GMTఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేనికి కూడా భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏ విషయమైనా సరే... వెనుకడుగు వేసేది లేదని తేల్చేశారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే.... అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే... సూటిగా దూసుకెళ్తున్న వ్యక్తిగా వైఎస్ జగన్‌కు పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మాట ఇస్తున్నా... ఇచ్చిన మాట తప్పను అని ఓటర్లకు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత... ముందుగా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టిన వైఎస్ జగన్... ఆ తర్వాత తనదైన దూకుడు నిర్ణయాలతో దూసుకెళ్లారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోంది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా... ఇంకా చెప్పాలంటే భయపడకుండా దూసుకెళ్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ప్రతిపక్షాలను లెక్క కూడా చేయటం లేదని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి కూడా.

అయితే తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇందుకు ప్రతిపక్షాల ఒత్తిడి కారణమనే తెలుస్తోంది. కరోనా కారణంగా గతేడాదిన్నర కాలంగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయిలో జరగటం లేదు. ఆరు నెలలకు ఒకసారి సభ సమావేశం కావాలనే నిబంధన ఉండటంతో... తప్పని సరిగా.. ఇంకా చెప్పాలంటే.. మొక్కుబడిగా సభను నిర్వహిస్తున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాల స్థానంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సమావేశాలు కూడా ఏదో అలా అలా నిర్వహించారు. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో... సేమ్ సీన్ రిపీట్. 2021-22 వార్షిక బడ్జెట్ సమావేశాల స్థానంలో ముందు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలని అనుకున్నారు. కానీ విపక్షాల ఆరోపణలతో ఒక అడుగు వెనక్కి వేశారు. అందుకే కేవలం ఒకటే రోజు సమావేశం ఏర్పాటు చేశారు. అదే రోజు బడ్జెట్ ప్రసంగం, ఆమోదం కూడా చేసేశారు. ఆ సమావేశాలను ప్రతిపక్షం బాయ్ కాట్ చేసింది. ఇప్పుడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ముందుగా ఒకరోజే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాల ఆరోపణలతో ఇప్పుడు అసెంబ్లీని ఏకంగా వారం రోజుల పాటు అంటే 26వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.





మండలి ఎన్నికలపై జగన్ దృష్టి..!

అమెరికాలో అంతా భయం భయం.. మళ్లీ అదే ఘటన?

బ్రేకింగ్: అమిత్ షా క్లాస్ తో లైన్లోకి వచ్చిన సోము

క‌ర్ష‌కుడా.. క‌ద‌లిరా..! కాంగ్రెస్ ఆందోళ‌న

టిటిడి కార్తీక దీపోత్సవం వాయిదా

తెలంగాణ‌లోనే వ‌రిలో నెంబ‌ర్ వ‌న్ న‌ల్ల‌గొండ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>