PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mekfe521e75-4c4d-4d12-931e-00fd5c53d133-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mekfe521e75-4c4d-4d12-931e-00fd5c53d133-415x250-IndiaHerald.jpgఊరికే డబ్బు వస్తుందంటే.. ఆ మజానే వేరు. అందుకే డబ్బులతో ముడిపడి ఉన్న టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు, హూ వాట్స్ టూబి మిలయనీర్, క్యాష్ వంటి టీవీ ప్రోగ్రాములకు మంచి రేటింగ్‌లు ఉంటాయి. ఆ షాల్లో పాల్గొన్న అభ్యర్థులు డబ్బు సంపాదిస్తుంటే.. టీవీల ముందు కూర్చున్నవారు కూడా ఆ డబ్బు తమకే వస్తుందేమో అన్నంత ఆసక్తిగా టీవీలు చూస్తుంటారు. అయితే.. అసలు ఏదైనా టీవీ షోలో ఎవరైనా రూ. కోటి రూపాయలు గెలుచుకుంటే.. వాస్తవానికి ఆ విజేత చేతికి వచ్చే ఎమౌంట్ ఎంతో తెలుసా.. ఈ విషయmek{#}Winner;Prize;kothagudem;television;Yevaruఅయ్యో.. రూ. కోటి గెలిస్తే.. చేతికి వచ్చేది ఇంతేనా..?అయ్యో.. రూ. కోటి గెలిస్తే.. చేతికి వచ్చేది ఇంతేనా..?mek{#}Winner;Prize;kothagudem;television;YevaruThu, 18 Nov 2021 07:00:00 GMTఊరికే డబ్బు వస్తుందంటే.. ఆ మజానే వేరు. అందుకే డబ్బులతో ముడిపడి ఉన్న టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు, హూ వాట్స్ టూబి మిలయనీర్, క్యాష్ వంటి టీవీ ప్రోగ్రాములకు మంచి రేటింగ్‌లు ఉంటాయి. ఆ షాల్లో పాల్గొన్న అభ్యర్థులు డబ్బు సంపాదిస్తుంటే.. టీవీల ముందు కూర్చున్నవారు కూడా ఆ డబ్బు తమకే వస్తుందేమో అన్నంత ఆసక్తిగా టీవీలు చూస్తుంటారు.


అయితే.. అసలు ఏదైనా టీవీ షోలో ఎవరైనా రూ. కోటి రూపాయలు గెలుచుకుంటే.. వాస్తవానికి ఆ విజేత చేతికి వచ్చే ఎమౌంట్ ఎంతో తెలుసా.. ఈ విషయం తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు.. ప్రైజ్ మనీపై పన్నులు ఉంటాయని తెలుసు కానీ.. మరి ఇంతగా పన్నులు వేస్తారా అని షాక్ అవుతారు. నిజమే మరి.. ఏదైనా షోలో రూ. కోటి గెలుచుకుంటే.. విజేత చేతికి వచ్చేది.. రూ.68,80,000 మాత్రమే. మిగిలిన రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. అంటే దాదాపు 31 లక్షలు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందన్నమాట.


మరి ఈ పన్ను ఎలా నిర్ణయిస్తారు అంటారా.. సాధారణంగా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే విజేత పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ. 10 వేలు దాటిన బహుమతులపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి‎‎ చట్టం ప్రకారం పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఈ పన్ను 31.2%  వరకూ ఉంది. అంటే.. ఓ కోటి రూపాయలు గెలుచుకుంటే.. 31 లక్షల రూపాయలు పన్ను కిందే పోతుందన్నమాట. ప్రైజ్ ఇచ్చే సమయంలోనే ఈ పన్ను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారన్నమాట.


ఈ లెక్కన మీలో కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది కేవలం 68 లక్షలే అన్నమాట. తాజాగా కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్ర ఇలా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న ఆయన  మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ. కోటి గెలుచుకున్నారు.





అయ్యో.. రూ. కోటి గెలిస్తే.. చేతికి వచ్చేది ఇంతేనా..?

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>