MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nayanatara-ac4cb3fa-32a6-490f-bdac-7522e1a83f91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nayanatara-ac4cb3fa-32a6-490f-bdac-7522e1a83f91-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార. ఒక దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నయనతార తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 75 చిత్రాలకు పైగా పని చేసింది. ఆమె తమిళం, మలయాళం, తెలుగు భాషా చిత్రాలలో తన ప్రతిభతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే లేడీ సూపర్ స్టార్ అనే స్థాయికి ఆమె క్రేజ్ చేరుకుంది. స్టార్ హీరోలకు సైతం ధీటుగా నిలిచింది నయన్. అందుకే ప్రముఖంగా 'ఫిమేల్ సూపర్ స్టార్' బిరుదును సంపాదించింది. ఆమె ఇప్పటికే అనేక అవార్డులను అందుకుంది. నటి ప్రతHBD Nayanatara;{#}Wife;arya;Aryaa;college;Prabhu Deva;Darsakudu;Director;Rajani kanth;News;Chennai;Chitram;nayana harshita;nayantara;Telugu;Heroine;Cinemaనయనతార గురించి 5 ఆసక్తికర విషయాలునయనతార గురించి 5 ఆసక్తికర విషయాలుHBD Nayanatara;{#}Wife;arya;Aryaa;college;Prabhu Deva;Darsakudu;Director;Rajani kanth;News;Chennai;Chitram;nayana harshita;nayantara;Telugu;Heroine;CinemaThu, 18 Nov 2021 11:00:00 GMTలేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార. ఒక దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నయనతార తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 75 చిత్రాలకు పైగా పని చేసింది. ఆమె తమిళం, మలయాళం, తెలుగు భాషా చిత్రాలలో తన ప్రతిభతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే లేడీ సూపర్ స్టార్ అనే స్థాయికి ఆమె క్రేజ్ చేరుకుంది. స్టార్ హీరోలకు సైతం ధీటుగా నిలిచింది నయన్. అందుకే ప్రముఖంగా 'ఫిమేల్ సూపర్ స్టార్' బిరుదును సంపాదించింది. ఆమె ఇప్పటికే అనేక అవార్డులను అందుకుంది. నటి ప్రతిభ, అందానికి నిజమైన పర్యాయ పదం అని చెప్పొచ్చు. ఆమె ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా నయన్ గురించి చాలామందికి అంతగా తెలియని కొన్ని వాస్తవాలు మీ కోసం !

నయనతార నిజానికి కర్ణాటకలోని బెంగళూరులో డయానా మరియం కురియన్‌ పేరుతో జన్మించింది. అదే ఆమె అసలు పేరు. తర్వాత సినిమాల్లోకి వచ్చాక ఆమె తన పేరును నయనతార అని మార్చుకుంది.  

నయనతార వాస్తవానికి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వాస్తవానికి ఆమె కేరళకు చెందినది. ఆమె సిరియన్ క్రిస్టియన్‌గా పెరిగింది. 2011 లో ఆమె చెన్నై లోని ఆర్య సమాజ్ ఆలయంలో హిందూ మతాన్ని స్వీకరించారు.

నయనతార అసలు నటి కావాలని ఎప్పుడూ కోరుకోలేదు, ఆమె చార్టర్డ్ అకౌంటెన్సీని కొనసాగించాలని కోరుకుంది. మార్తోమా కాలేజీ నుండి ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించింది. పార్ట్ టైమ్ మోడల్‌గా పని చేస్తున్నప్పుడు దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ద్వారా ఆమెను గుర్తించారు. అప్పట్లో ఆమె కేవలం ఒకే ఒక చిత్రం చేయడానికి అంగీకరించింది. అలా నయన్ నటించిన 'మనసునక్కరే' చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఆమె తరువాత ఆఫర్లను అందుకోవడం కొనసాగించింది.

అప్పటికే పెళ్లయిన ప్రభుదేవాతో డేటింగ్ ప్రారంభించిన నయనతార చాలా వివాదాలను ఎదుర్కొంది. ఆమె తన చేతిపై అతని పేరును టాటూగా కూడా వేయించుకుంది.  తరువాత ప్రభుదేవా మొదటి భార్య నుండి చాలా వ్యతిరేకత ఎదుర్కొన్న నయన్ 2011లో అతనితో విడిపోయింది. ఆమె తన కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వచ్చే ఏడాది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.

రోహిత్ శెట్టి 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో నయనతారకు డ్యాన్స్ నంబర్ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుదేవా డ్యాన్స్ నంబర్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నందున ఆమె ఆఫర్‌ను తిరస్కరించిందని అన్నారు.



టీడీపీ నంద‌మూరికే ఇచ్చేయాలి.. మ‌రోసారి అదే డిమాండ్‌..!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>