PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan82ed94ad-77b5-4d0d-9bea-1fee97a8907b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan82ed94ad-77b5-4d0d-9bea-1fee97a8907b-415x250-IndiaHerald.jpgఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జనసేన కాస్త దూకుడుగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే పవన్ కల్యాణ్...వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల దాడి పెంచారో అప్పటినుంచి, జనసేనలో కొత్త ఊపు వచ్చింది. అయితే నిదానంగా జనసేనలో చేరేందుకు కొందరు నాయకులు కూడా క్యూ కడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే, ఇప్పటివరకు జనసేనలో పెద్దగా నేతలు జాయిన్ అవ్వలేదు. పైగా జనసేన నేతలే వైసీపీ, బీజేపీల్లోకి వెళ్లారు. pawan{#}Janasena;MLA;Pamarru;Congress;Andhra Pradesh;TDPజనసేనలోకి మాజీ ఎమ్మెల్యే...సీటు ఫిక్స్?జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే...సీటు ఫిక్స్?pawan{#}Janasena;MLA;Pamarru;Congress;Andhra Pradesh;TDPWed, 17 Nov 2021 03:00:00 GMTఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జనసేన కాస్త దూకుడుగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే పవన్ కల్యాణ్...వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల దాడి పెంచారో అప్పటినుంచి, జనసేనలో కొత్త ఊపు వచ్చింది. అయితే నిదానంగా జనసేనలో చేరేందుకు కొందరు నాయకులు కూడా క్యూ కడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే, ఇప్పటివరకు జనసేనలో పెద్దగా నేతలు జాయిన్ అవ్వలేదు. పైగా జనసేన నేతలే వైసీపీ, బీజేపీల్లోకి వెళ్లారు.

కానీ ఇకపై జనసేనలోకి వలసలు ఉంటాయని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎప్పుడైతే జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం మొదలైందో అప్పటినుంచి కొందరు నాయకులు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల పొత్తు ఉంటే...పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు దక్కుతాయి...కాబట్టి ఆ సీట్లలో పోటీ చేయడానికి అవకాశాలు దొరుకుతాయని నేతలు చూస్తున్నారు. అదేవిధంగా రెండు పార్టీల పొత్తుతో గెలిచి అధికారంలోకి వస్తే ఏదొక పదవి వస్తుందనే ఆశ కూడా నేతలకు ఉంది.

అందుకనే కొందరు నేతలు జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే డివై దాస్...జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దాస్...2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో పామర్రులో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.

2019 ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన సీటు వస్తుందని ఆశించారు. కానీ సీటు దొరకలేదు. దీంతో ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అయితే వైసీపీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. అలాగే ఏ పదవి కూడా రాలేదు. దీంతో ఆయన జనసేనతో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. జనసేన నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దాస్ జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జనసేనలోకి వస్తే పామర్రు టిక్కెట్ ఆయనకే వస్తుంది. టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం సీటు దక్కదు. ఎందుకంటే పామర్రులో టీడీపీనే బరిలో దిగుతుంది.     



జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే...సీటు ఫిక్స్?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>