PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp65dc7f83-ee11-4fe1-b7bf-dbfd5bd95a93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp65dc7f83-ee11-4fe1-b7bf-dbfd5bd95a93-415x250-IndiaHerald.jpgఎందుకంటే కొన్ని రాజ‌కీయ వైరుధ్యాల‌లో భాగంగా జ‌గ‌న్ తాను అనుకున్న‌ది చేసేందుకు నానా అవ‌స్థ‌లూ ప‌డ్డాడు. దీంతో చాలా చోట్ల త‌న‌దైన ఇమేజ్ ను ఆయ‌న కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం కుప్పంలో అనుకున్న‌ది సాధించాడు. కుప్పం మున్సిపాల్టీలో 25 వార్డుల‌కు గాను 19 గెలుచుకున్నాడు. మంచిది ఇంత‌టి హోరులోనూ టీడీపీ గెలిచింది. ఇది కూడా మంచి ప‌రిణామ‌మే! ఈ కోవ‌లో ఈ తోవ‌లో జ‌రిగిన‌వేవో చెప్పుకుందాం ఓ సారి.ycp{#}Mithoon;Abhimanyu Mithun;local language;kuppam;TDP;CMద‌య‌చేసి వినండి! స‌మాంతర ప్ర‌భుత్వాలు న‌డ‌ప‌కండి!ద‌య‌చేసి వినండి! స‌మాంతర ప్ర‌భుత్వాలు న‌డ‌ప‌కండి!ycp{#}Mithoon;Abhimanyu Mithun;local language;kuppam;TDP;CMWed, 17 Nov 2021 20:49:06 GMT
ఎన్నిక‌లు / ఫ‌లితాలు / త‌రువాత రోజువారీ త‌గాదాలు/ నువ్వెంత అంటే నువ్వెంత / అని గొడ‌వేసుకోవ‌డాలు..ఇవ‌న్నీ ఎప్పుడూ ఉండేవే! కానీ కొన్ని సార్లయినా ప్ర‌జాస్వామ్యం గెలిచింద‌ని అనుకునేందుకు వీల్లేకుండా కొన్ని ఎన్నిక‌లు చేస్తాయి. కొన్ని సార్లు అస్స‌లు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ఏమ‌యినా కానివ్వండి కానీ ఈ స్థానిక ఎన్నిక‌లన్న‌వి రెండు పార్టీల‌కూ స‌వాలు అని అనేందుకు వీల్లేకుండా చేశాడు జ‌గ‌న్.


ఎందుకంటే కొన్ని రాజ‌కీయ వైరుధ్యాల‌లో భాగంగా జ‌గ‌న్ తాను అనుకున్న‌ది చేసేందుకు నానా అవ‌స్థ‌లూ ప‌డ్డాడు. దీంతో చాలా చోట్ల త‌న‌దైన ఇమేజ్ ను ఆయ‌న కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం కుప్పంలో అనుకున్న‌ది సాధించాడు. కుప్పం మున్సిపాల్టీలో 25 వార్డుల‌కు గాను 19 గెలుచుకున్నాడు. మంచిది ఇంత‌టి హోరులోనూ టీడీపీ గెలిచింది. ఇది కూడా మంచి ప‌రిణామ‌మే! ఈ కోవ‌లో ఈ తోవ‌లో జ‌రిగిన‌వేవో చెప్పుకుందాం ఓ సారి.

సీమ రాజ‌కీయాల‌ను ప్ర‌త్యేకంగా న‌డిపించాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్నాడు జ‌గ‌న్. అయితే పార్టీకి ఫండ్ ను స‌మ‌కూర్చే పెద్ద‌న్న పెద్దిరెడ్డి ఉంటుండగా జ‌గ‌న్ మాట కానీ ఆట కానీ కొన్నిసార్లు చెల్లే అవ‌కాశ‌మే లేకుండా చేయాల‌న్న‌ది పెద్దిరెడ్డి ప్లాన్ కావొచ్చు. కానీ ఇప్ప‌టికైతే పెద్దిరెడ్డిని దూరం పెట్ట‌నూ లేక అలానే వారి అబ్బాయికి మిథున్  రెడ్డినీ దూరం పెట్ట‌లేక అటు ఢిల్లీలో నూ ఇటు గ‌ల్లీలోనూ  వారికే అధికారంకు సంబంధించి ప‌నులు అప్ప‌గిస్తున్నాడు జ‌గ‌న్. ఇదంతా బాగున్నా కూడా ఇప్ప‌టికే పెద్దిరెడ్డి రాష్ట్రంలో స‌మాంత‌ర ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని, సీఎంను అనేక సార్లు ఢీ కొనేందుకు ట్రై చేశార‌ని టాక్ కూడా ఉంది. ఇదే విధంగా గతంలో సీఎంతో స‌మానంగా చిన్న సీఎం గా ఉంటూ టీడీపీ ప్ర‌భుత్వాన్ని న‌డిపి అభాసుపాల‌య్యాడు లోకేశ్. ఇప్పుడు కూడా ఇలాంటి త‌ప్పిదాలే రాష్ట్రంలో పున‌రావృతం అవుతున్నాయి. కనుక కుప్పంలో గెలిచినంత మాత్రాన ప్ర‌పంచాన్ని గెలిచిన విధం కాదు. కానీ అలా అనుకుంటే ఎవ్వ‌రూ ఏం చేయ‌లేం.





ఇస్రో చంద్ర ఆర్బిటర్ చంద్రయాన్ -2 ని నాసా LRO తో ఢీకొనడాన్ని ఎలా తప్పించింది?

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>