జిల్లాలో అనేక అక్రమాలు.!వెంకట్రామి రెడ్డిపై చర్యలు తీసుకావాలంటున్న సిద్దిపేట కాంగ్రెస్ నేతలు.!
సిద్దిపేట/హైదరాబాద్ : సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చాసారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మూడు మండలాల నాయకులు చేర్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో చేసిన అవకతవకలు, భూముల కొనుగోలు వ్యవహారంలో చేసిన అవినీతి గురించి వివరిస్తూ ఓ నివేదికను రూపొందించారు. వెంకట్రామి రెడ్డి కలెక్టర్ గా విధులు నిర్వహస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అనేక విషయాల్లో ప్రత్యక్షంగా సహకరించాడని ఘాటు విమర్శలు చేసారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం దుడ్డెడ గ్రామానికి చెందిన దళితుల మూడు వందల ఎకరాల భూములను అన్యాయంగా గుంచుకుని వారి నోట్లో మట్టికొట్టిన చరిత్ర వెంకట్ రామిరెడ్డిదని మండిపడ్డారు.

అంతేకాకుండా కొద్ది నెలల క్రితం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రవుకు పాదాభివందనాలు చేసి సిద్దిపేట జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరి పంటకు సంబంధించిన విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయనంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి న్యాయస్థానాల గౌరవాన్ని కించపరిచాడని మండిపడ్డారు. అంతే కాకుండా కొకపేట ప్రభుత్వ భూముల వేలంలో తొమ్మిదిన్నర ఎకరాల భూమిని 400 కోట్లు చెల్లించి ధక్కించుకున్నారని, మరి అతనికి అంత పెద్దమొత్తంలో డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో న్యాయ విచారణ చేపట్టి అతనిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. చేర్యాల మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు