PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6974af72-0df1-4fae-bee3-02d04432e8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6974af72-0df1-4fae-bee3-02d04432e8d2-415x250-IndiaHerald.jpgఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన శక్తికి మించి ఇప్పటికే అప్పులు చేసిందా.. ఇక ఏపీకి కొత్త అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా.. ఏపీ ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మరిన్ని కొత్త అప్పులు తేవాల్సిందేనా.. ఇలా పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే.. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందా.. అవునంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఏపీ తమకు చెల్లించాల్లిన అప్పులను రాబట్టుకునేందుకు ఢిల్లీ నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషనjagan{#}PAYYAVULA KESHAV;Telugu Desam Party;Delhi;electricity;Government;Minister;Andhra Pradesh;TDP;central governmentజగన్.. ఇప్పటికైనా నిజాలు చెప్పు.. ప్లీజ్..?జగన్.. ఇప్పటికైనా నిజాలు చెప్పు.. ప్లీజ్..?jagan{#}PAYYAVULA KESHAV;Telugu Desam Party;Delhi;electricity;Government;Minister;Andhra Pradesh;TDP;central governmentWed, 17 Nov 2021 06:00:00 GMTఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన శక్తికి మించి ఇప్పటికే అప్పులు చేసిందా.. ఇక ఏపీకి కొత్త అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా.. ఏపీ  ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మరిన్ని కొత్త అప్పులు తేవాల్సిందేనా.. ఇలా పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే.. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందా.. అవునంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.


ఏపీ తమకు చెల్లించాల్లిన అప్పులను రాబట్టుకునేందుకు ఢిల్లీ నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అధికారులు  రాష్ట్రానికి అప్పులు వసూళ్లకు వస్తున్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని.. కనీసం ఇన్ స్టాల్ మెంట్స్ కట్టకుండా పెండింగ్ పెట్టారని పయ్యావుల కేశవ్ వంటి నేతలు ఆరోపిస్తున్నారు.


ఇలా పెండింగ్‌ పెట్టడం వల్ల ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా మారిపోయాయని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తాను చేసిన అప్పులను దేశం గుర్తించేలా చేసిందంటున్న పయ్యావుల కేశవ్.. ఓ ప్రభుత్వం వద్దకు సంస్థ ప్రతినిధులు అప్పుల వసూళ్ళ కు వస్తున్నారంటేనే ఏపీ ఆర్థిక పరిస్తితి కుప్పకూలిందని అర్థం అవుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పుల వసూళ్లకి ఢిల్లీ నుంచి వస్తున్నారు అంటే పరిస్థితి చేయిదాటి పోయిందని తెలిసిపోతోందని పయ్యావుల కేశవ్ అంటున్నారు.


ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని.. అందుకే కేంద్రం ఇప్పటికైనా రాష్ట్ర పరిస్థితి బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పయ్యావుల కేశవ్. కేంద్ర ప్రభుత్వ పాలకులకు రాష్ట్ర ప్రభుత్వం తో సంబంధాలు ఉన్నాయని.. ఆర్థిక మంత్రి బుగ్గన ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  జగన్..ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు.. వాస్తవాలు చెప్పండని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.



కుప్పంలో విజయం ఎవరిది..? ఫ‌లితంపై ఉత్కంఠ‌..!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>