MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taxiwala-movie31a9d55e-2b1f-449b-bff6-da7f7fe905ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taxiwala-movie31a9d55e-2b1f-449b-bff6-da7f7fe905ce-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'టాక్సీ వాలా' జీ ఏ 2 పిక్చర్స్ యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో కళ్యాణి, యమునా లాంటి సీనియర్ నటీమణులు కూడా నటించారు. 2018 నవంబర్ 17న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈరోజు తో ఈ చిత్రం విడుదలై మూడు ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గTaxiwala Movie{#}Ananya Pandey;priyanka jawalkar;Geetha Govindam;Gita Govindam;Taxiwala;Devarakonda;rahul;Rahul Sipligunj;Raj Tarun;Tarun Kumar;raja;raj;Blockbuster hit;Yevaru;bollywood;Hero;November;Darsakudu;Director;Chitram;Heroine;vijay deverakonda;Joseph Vijay;Cinemaటాక్సీవాలా సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..?టాక్సీవాలా సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..?Taxiwala Movie{#}Ananya Pandey;priyanka jawalkar;Geetha Govindam;Gita Govindam;Taxiwala;Devarakonda;rahul;Rahul Sipligunj;Raj Tarun;Tarun Kumar;raja;raj;Blockbuster hit;Yevaru;bollywood;Hero;November;Darsakudu;Director;Chitram;Heroine;vijay deverakonda;Joseph Vijay;CinemaWed, 17 Nov 2021 18:51:44 GMTటాలీవుడ్ లో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'టాక్సీ వాలా' జీ ఏ 2 పిక్చర్స్ యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో కళ్యాణి, యమునా లాంటి సీనియర్ నటీమణులు కూడా నటించారు. 2018 నవంబర్ 17న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈరోజు తో ఈ చిత్రం విడుదలై మూడు ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

 నిజానికి విడుదలకు ముందే ఈ సినిమా పైరసీ బారిన పడింది. పైగా ఈ సినిమాకి నూతన దర్శకుడు కావడంతో సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సినిమాని చాలా చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే టాక్సీ వాలా సినిమా కథ నిజానికి మొదట వేరే హీరో కి వెళ్ళింది. ఆ హీరో నో చెప్పడంతో అప్పుడు విజయ్ దేవరకొండ వద్ద వచ్చి చేరింది. ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు మన హీరో యంగ్ రాజ్ తరుణ్. ఈ సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మొదట టాక్సీవాలా కథను హీరో రాజ్ తరుణ్ కి వినిపించాడట.

 కానీ రాజ్ తరుణ్ వద్ద పని చేసే అసిస్టెంట్ మరియు రాజా రవీంద్ర ఈ కథ రిస్క్ అని చెప్పడంతో రాజ్ తరుణ్ వెనకడుగు వేశాడట. ఈ విషయాన్ని రాజా రవీంద్ర స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఈ కథను ఓకే చేసినప్పుడు కథలో చాలా మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్యాచ్ వర్క్ అంతా దర్శకుడు మారుతి తెరకెక్కించడం గమనార్హం. మొత్తానికి ఈ సినిమా కథ రిస్క్ అని తెలియడంతో ముందు రాజ్ తరుణ్ ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం రిస్క్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది...!!



గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్

కొండ‌ప‌ల్లిలో ఊహించ‌ని ట్విస్ట్‌...! ఎంపీ నాని ఓటు చెల్లుతుందా..?

ఏపీ విద్యార్ధులకు పండుగే, జగన్ స్పష్టమైన ఆదేశాలు

మళ్ళీ వస్తా.. సూపర్ స్టార్ అవుతా : శరత్ కుమార్

ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇదేనెమో...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>