PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే.. జాతీయ స్థాయి నేతలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అంతే వయసున్న నేత... కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని తెగ మాట్లాడేసుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేని నేతగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి చేపటjagan{#}rachana;Vijayawada;Tirupati;Jagan;Andhra Pradesh;District;Nellore;Hanu Raghavapudi;Party;YCP;local language;House;Telangana Chief Ministerకాలు కదపడు... కానీ గెలిచి చూపించాడు...!కాలు కదపడు... కానీ గెలిచి చూపించాడు...!jagan{#}rachana;Vijayawada;Tirupati;Jagan;Andhra Pradesh;District;Nellore;Hanu Raghavapudi;Party;YCP;local language;House;Telangana Chief MinisterWed, 17 Nov 2021 15:56:25 GMTవైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే.. జాతీయ స్థాయి నేతలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అంతే వయసున్న నేత... కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని తెగ మాట్లాడేసుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేని నేతగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలోనే దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రూపొందించారు. ప్రజలకు సంక్షేమ పధకాలు నేరుగా అందేలా చూసుకున్నారు.

అదే సమయంలో రాజకీయాల్లో కూడా అంతే చురుగ్గా వ్యవహరించారు. పంచాయతీ, స్థానిక సంస్థలు, కార్పొరేషన్, మునిసిపాలిటీ... ఇలా ఎన్నిక ఏదైనా సరే... తమదే విజయం అన్నట్లుగా వ్యూహ రచన చేశారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా... మునిసిపాలిటీలు మొత్తం ఏకగ్రీవం అయ్యేలా చూశారు. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ స్థానాలను సొంతం చేసుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థను క్లీన్ స్వీప్ చేశారు. రెండున్నర ఏళ్ల కాలంలో జగన్ కనీసం ఒక్క రాజకీయ సభలో కూడా పాల్గొనలేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. అది కూడా విజయవాడ పరిసరాల్లో జరిగే వాటిల్లో మాత్రమే. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించినా కూడా జగన్ మాత్రం.. తన ఇల్లు దాటి బయటకు కాలు పెట్టలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. ప్రచార తేదీ కూడా నిర్ణయించారు. అయితే కొవిడ్ వైరస్ కారణంగా ప్రచారానికి రాలేక పోతున్నట్లు జగన్ ప్రకటించారు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కనీసం కాలు బయట పెట్టకుండా... ఇన్ని విజయాలు ఎలా సాధ్యమని అంతా ఆశ్చర్యపోతున్నారు.





కాలు కదపడు... కానీ గెలిచి చూపించాడు...!

72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..! నిందితుడు అరెస్ట్‌

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..!

ఏపీకి.. ఐదు కొత్త పరిశ్రమలు..!

కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవ‌సం

టీడీపీ అభ్య‌ర్థికి స్వ‌తంత్ర అభ్య‌ర్థి మ‌ద్ద‌తు..?

బీజేపీ : పదవుల్లేవ్.. వచ్చేవారికి స్వాగతం..!

ఉత్కంఠ‌గా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఫ‌లితాలు

మహేష్ "అతడు" టైటిల్ సాంగ్ చాలా స్పెషల్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>