PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan6e2fb4cd-66db-4f3e-a19c-a6d4fa4ad1b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan6e2fb4cd-66db-4f3e-a19c-a6d4fa4ad1b8-415x250-IndiaHerald.jpg2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తప్పుబట్టింది కూడా. అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటికి హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. కొన్ని కేసుల్లో అయితే జగన్ సర్కార్‌కు చీవాట్లు కూడా పడ్డాయి. అదే సమయంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను కూడా నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కొందరిపై అరెస్టు వారెంట్ Jagan{#}Supreme Court;prasanth;Prashant Kishor;High court;ramana;Lawyer;Letter;Government;Jagan;Andhra Pradesh;YCP;Y. S. Rajasekhara Reddy;Partyఏపీలో జగన్ వర్సస్ జడ్జీలు...!ఏపీలో జగన్ వర్సస్ జడ్జీలు...!Jagan{#}Supreme Court;prasanth;Prashant Kishor;High court;ramana;Lawyer;Letter;Government;Jagan;Andhra Pradesh;YCP;Y. S. Rajasekhara Reddy;PartyTue, 16 Nov 2021 10:57:03 GMT2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తప్పుబట్టింది కూడా. అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటికి హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. కొన్ని కేసుల్లో అయితే జగన్ సర్కార్‌కు చీవాట్లు కూడా పడ్డాయి. అదే సమయంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను కూడా నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కొందరిపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసేసింది హైకోర్టు. దీంతో తీవ్ర అసహానానికి గురైన జగన్ సర్కార్... తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కొంతమంది న్యాయమూర్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించేసింది. సుప్రీం కోర్టు సీజే పదవికి జస్టిస్ ఎన్‌వి రమణ అర్హుడు కాదంటూ కూడా లేఖలు రాసింది జగన్ సర్కార్. దీని ద్వారా తమ ప్రభుత్వానికి కోర్టులు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నం చేశారు కూడా వైసీపీ నేతలు.

ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి పస లేదని సుప్రీం కోర్టు తేల్చేసింది. హైకర్టులో ప్రస్తుతం మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల ప్రస్తుతం రోజూ వారీ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేస్తున్న త్రి సభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులను మార్చాలంటూ జగన్ ప్రభుత్వం తరఫు న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిని తిరస్కరించారు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది కూడా. అసలు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే... జగన్ వర్సస్ జడ్జిలు అన్నట్లుగా మారిపోయింది. అసలు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులతో తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటూ సుప్రీం కోర్టుకు లేఖ కూడా రాశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ లేఖ బయటకు రావడంతో... అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ మొత్తం వ్యవహారంపై కూడా సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక చేసేది ఏం లేక జగన్ సర్కార్ కూడా మౌనం వహించింది.





బ్రేకింగ్: విశాఖ ప్రేమ్మోన్మాది మృతి

హైదరాబాద్ లో ఆ రెండు శవాలు ఎక్కడివి...?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

గోదావరి జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటేనా..?

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళ మృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>