MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp8a8dab43-cfed-4601-88d5-938d3378c1ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp8a8dab43-cfed-4601-88d5-938d3378c1ca-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీలో అదృష్టం కుదిరి మంత్రి పదవి దక్కించుకున్నవారిలో చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా ఒకరు. మడలి రద్దు అనేది చెల్లుబోయినకు బాగా కలిసొచ్చింది....ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన పిల్లి సుభాష్ రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్‌లో చెల్లుబోయినకు మంత్రి పదవి దక్కింది. జగన్ క్యాబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ysrcp{#}THOTA TRIMURTHULU;Backward Classes;Ramachandrapuram;రాజీనామా;Reddy;Party;Minister;Government;TDP;Jaganహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెల్లుబోయినకు అతి పెద్ద ప్లస్ అదే...!హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెల్లుబోయినకు అతి పెద్ద ప్లస్ అదే...!ysrcp{#}THOTA TRIMURTHULU;Backward Classes;Ramachandrapuram;రాజీనామా;Reddy;Party;Minister;Government;TDP;JaganTue, 16 Nov 2021 05:00:00 GMTఅధికార వైసీపీలో అదృష్టం కుదిరి మంత్రి పదవి దక్కించుకున్నవారిలో చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా ఒకరు. మడలి రద్దు అనేది చెల్లుబోయినకు బాగా కలిసొచ్చింది....ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన పిల్లి సుభాష్ రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్‌లో చెల్లుబోయినకు మంత్రి పదవి దక్కింది. జగన్ క్యాబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

ఇక మంత్రిగా చెల్లుబోయిన ఎలా పనిచేస్తున్నారంటే...ఈయన పేరుకే మంత్రి అని, పెత్తనం అంతా బీసీ శాఖలో ఒక అధికారిది అనే విమర్శలు ఉన్నాయి. కావాలనే ఆ అధికారిని చెల్లుబోయిన తన శాఖలోకి తీసుకొచ్చి పెత్తనం ఇచ్చారని తెలుస్తోంది. ఇక బీసీ శాఖలో మొత్తం ఆ అధికారిదే హవా అంటా...చెల్లుబోయిన కేవలం సంతకాలకే పరిమితమయ్యారని టాక్. సిబ్బంది బదిలీలు, పదోన్నతులు అన్నీ ఆ అధికారి చేతుల్లోనే ఉన్నాయట. అంటే మంత్రిగా చెల్లుబోయిన చేసేది ఏమి లేదని తెలుస్తోంది. ఇక మంత్రిగా చెల్లుబోయిన పెద్దగా హైలైట్ అవ్వలేదనే చెప్పొచ్చు. అలాగే బీసీలకు కూడా ఒరిగింది ఏమి లేదని తెలుస్తోంది.

ఎమ్మెల్యేగా చూస్తే రామచంద్రాపురం నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని తెలుస్తోంది. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తప్ప. సొంతంగా నిధులు తెచ్చి నియోజకవర్గంలో గొప్ప కార్యక్రమాలు చేయలేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్ల పరిస్తితి బాగోలేదు. అయితే మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా కాస్త పర్వాలేదనిపిస్తున్నారు.

అటు రాజకీయంగా చూస్తే ఇక్కడ చెల్లుబోయినకు ఉన్న అతి పెద్ద ప్లస్ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమే. ఇక్కడ టీడీపీ వీక్‌గా ఉండటమే చెల్లుబోయినకు ప్లస్. తోట త్రిమూర్తులు టీడీపీని వీడాక రామచంద్రాపురంలో ఆ పార్టీ పరిస్తితి ఘోరంగా తయారైంది. తోటతో పాటు చాలా క్యాడర్ వైసీపీలోకి వెళ్లింది. దీంతో రామచంద్రాపురంలో టీడీపీ చాలా వీక్‌గా ఉంది. ప్రస్తుతం రెడ్డి సుబ్రహ్మణ్యంని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన వల్ల కూడా పార్టీ బలోపేతం కావడం లేదు. మొత్తానికైతే చెల్లుబోయినకు టీడీపీ బాగా ప్లస్ అవుతుంది.





గంజాయి దందా: విశాఖ టు ఎంపీ.. వయా అమెజాన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>