MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli3fc370a2-2663-48f0-b77c-797da56bf732-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli3fc370a2-2663-48f0-b77c-797da56bf732-415x250-IndiaHerald.jpg జాతీయ స్థాయిలో ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘నాటు నాటు’ పాట ట్రెండింగ్ గా కొనసాగుతోంది. దీనితో ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ పాట చుట్టూ కాపీ కామెంట్స్ హడావిడి చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది.ఈ పాట ఒక ఆఫ్రికన్ మూవీ నుంచి మక్కీ మక్కీ గా కాపీ కొట్టేసారని కొందరు నెగిటివ్ కామెంట్స్ ప్రచారంలోకి తీసుకు వస్తూ హడావిడి చేస్తున్నారు. అంతేకాదు ఈ పాటకు మూలమైన ఒక ఆఫ్రికన్ మూవీలో ఆ సినిమాలోని హీరోలు కూడ ఇలాగే ఒకే రకమైన కాస్ట్యూrrr rajamouli{#}Rajamouli;Cinemaఆర్ ఆర్ ఆర్ నాటు నాటు చుట్టూ కాపీ కామెంట్స్ !ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు చుట్టూ కాపీ కామెంట్స్ !rrr rajamouli{#}Rajamouli;CinemaTue, 16 Nov 2021 08:00:00 GMT
జాతీయ స్థాయిలో ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘నాటు నాటు’ పాట ట్రెండింగ్ గా కొనసాగుతోంది. దీనితో ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ పాట చుట్టూ కాపీ కామెంట్స్ హడావిడి చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది.



ఈ పాట ఒక ఆఫ్రికన్ మూవీ నుంచి మక్కీ మక్కీ గా కాపీ కొట్టేసారని కొందరు నెగిటివ్ కామెంట్స్ ప్రచారంలోకి తీసుకు వస్తూ హడావిడి చేస్తున్నారు. అంతేకాదు ఈ పాటకు మూలమైన ఒక ఆఫ్రికన్ మూవీలో ఆ సినిమాలోని హీరోలు కూడ ఇలాగే ఒకే రకమైన కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకే తీరుగా చాల వేగంగా స్టెప్స్ వేసారని ఆ ఆఫ్రికన్ మూవీ సాంగ్ క్లిప్పింగ్స్ పెట్టి మరీ నెట్లో రాజమౌళి ‘నాటు’ సాంగ్ ని టార్గెట్ చేస్తున్నారు.  



గతంలో కూడ రాజమౌళి పై ఇలాంటి కాపీ వివాదాలు వచ్చాయి. రాజమౌళి తీసిన ‘ఈగ’ ‘కాక్రోచ్’ అనే మూవీకి కాపీ అంటూ గతంలో హడావిడి జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ విషయం పై స్పందిస్తూ రాజమౌళి తాను కొన్ని విదేశీ సినిమాలను అనుసరిస్తాను కానీ కాపీ కొట్టను అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు కాపీ వేరు అనుసరణ వేరు అంటూ ఒక కొత్త వాదం ప్రచారంలోకి తీసుకు వచ్చారు.


ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ‘నాటు’ సాంగ్ మీద హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సాంగ్ కాపీ అంటూ జరుగుతున్న వివాదం ఇండస్ట్రీలో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ  నాటు పాటకు భారీ స్థాయిలో వ్యూస్ రావడంతో ఈ కాపీ కామెంట్స్ సరికొత్తగా వెలుగులోకి వచ్చి ఈ ‘నాటు’ పాటను చాలామంది ఒకటికి రెండుసార్లు చూస్తూ ఈ పాటకు వచ్చే హిట్స్ సంఖ్యను లక్షల స్థాయిలో పెంచుతున్నారు..  





ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు చుట్టూ కాపీ కామెంట్స్ !

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>