PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/teenmar-mallannaaffd43b2-623d-439c-86d5-cd4f92a9b102-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/teenmar-mallannaaffd43b2-623d-439c-86d5-cd4f92a9b102-415x250-IndiaHerald.jpgఇటీవ‌ల జైలు నుంచి విడుద‌ల అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న రాజ‌కీయంగా ఎలాంటి ముంద‌డుగు వేస్తారా అన్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మ‌ల్ల‌న్న‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై ఎప్పుడు త‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉంటారు. అంతే కాదు అధికార గులాబీ పార్టీ అవ‌లంభిస్తున్న విధానాల‌పై గ‌ట్టిగానే పోరాటం చేశారు.. అలాగే రాజ‌కీయ విశ్లేష‌కుడిగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మంచి అనుభ‌వం కూడా ఉంది. అలాగే త‌న‌కంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకుని రాజ‌కీయంగా యteenmar mallanna{#}Telangana Rashtra Samithi TRS;Telangana;Partyక‌మ‌ళం పార్టీలో చేరిక‌పై మ‌ల్ల‌న్న క్లారిటీ..!క‌మ‌ళం పార్టీలో చేరిక‌పై మ‌ల్ల‌న్న క్లారిటీ..!teenmar mallanna{#}Telangana Rashtra Samithi TRS;Telangana;PartyTue, 16 Nov 2021 10:41:33 GMT ఇటీవ‌ల జైలు నుంచి విడుద‌ల అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న రాజ‌కీయంగా ఎలాంటి ముంద‌డుగు వేస్తారా అన్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మ‌ల్ల‌న్న‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై ఎప్పుడు త‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉంటారు. అంతే కాదు అధికార గులాబీ పార్టీ అవ‌లంభిస్తున్న విధానాల‌పై గ‌ట్టిగానే పోరాటం చేశారు.. అలాగే రాజ‌కీయ విశ్లేష‌కుడిగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మంచి అనుభ‌వం కూడా ఉంది. అలాగే త‌న‌కంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకుని రాజ‌కీయంగా యాక్టివ్ గా ప‌ని చేస్తున్నారు మ‌ల్ల‌న్న‌.


 అదే విధంగా ఇటీవ‌ల జ‌రిగిన న‌ల్గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగల్ గ్రాడ్యూయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దాదాపు టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని ఓడించినంత ప‌ని చేశారు. అయితే, చివ‌ర‌లో టీఆర్ఎస్‌కు మెజారిటీ రావ‌డంతో టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. ఇక అలా గులాబీ పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టించిన మ‌ల్ల‌న్న అప్ప‌టి నుంచి హైలెట్ అవుతూనే వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో మ‌ల్ల‌న్న ప‌లు సార్లు అరెస్టు అయ్యాడు. అయితే, మ‌ల్ల‌న్న‌పై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించి కావాల‌నే టీఆర్ఎస్ అరెస్టు చేయించంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌ల్ల‌న్న గులాబీ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


 ఇక త‌న‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి బ‌య‌ట వ్య‌క్తుల‌తో కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న మాట వాస్త‌వ‌మే అని చెప్పిన మ‌ల్ల‌న్న.. కొత్త పార్టీ పెట్ట‌డ‌మా లేదా ఇత‌ర పార్టీలో చేర‌డ‌మా లేదా బ‌య‌ట నుంచి ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మా అనే విష‌యాలపై త‌న కార్య‌చ‌ర‌ణ‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల‌ని త‌న టీమ్‌తో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు మ‌ల్ల‌న్న‌. అయితే, బ‌య‌ట నుంచి పార్టీకి స‌పోర్ట్ ఇవ్వ‌డం లేదా ఇత‌ర పార్టీ లో చేర‌డం గురించే ఎక్కువ చ‌ర్చ‌కు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. అయితే, బీజేపీలో చేరే ఆలోచ‌న‌లో మ‌ల్ల‌న్న ఉన్నట్టు స‌మాచారం.



బాబోయ్.. ఇలాంటి కారణానికి కూడా సూసైడ్ చేసుకుంటారా?

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

గోదావరి జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటేనా..?

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళ మృతి

బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>