PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-728b7dbc-2aa0-4bc4-bb21-68d1497607a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-728b7dbc-2aa0-4bc4-bb21-68d1497607a4-415x250-IndiaHerald.jpgముందుకు వేయాలంటే ఆలోచిస్తోందట . ముఖ్యంగా కొత్త పాత నేతల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా సమన్వయం కోసం ప్రయత్నిస్తోందట. కమలం లీడర్లు కీలకమైన ఫ్లోర్ లీడర్ ని ఎంపిక చేయలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగూ అందరినీ సాటిస్పై చెయ్యడం ఇంపాజిబుల్ కాబట్టి అందరినీ కలుపుకుపోయే నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంచనాతో కమలం క్యాంపు ఉంటే ఈ ఎంపిక ఎంత ఆలస్యం చేస్తే అంత పార్టీకే నష్టం అన్న అంచనాలో కార్పోరేటర్లు ఉన్నారట. ఎవరెన్ని చెప్పినా డెసిషన్ తీసుకునేది పార్టీ అధినాయకత్వమే.Political {#}lotus;MP;Leader;MLA;Hyderabad;Bharatiya Janata Party;Partyజిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ .. ఎవరు..?జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ .. ఎవరు..?Political {#}lotus;MP;Leader;MLA;Hyderabad;Bharatiya Janata Party;PartyTue, 16 Nov 2021 09:07:00 GMTజీహెచ్ఎంసీలో కమలనాథులకు ఓ ఫ్లోర్ లీడర్ కావాలట. గ్రేటర్ పాలక మండలి ఏర్పాటు జరిగి  ఏడాది గడుస్తున్నా బిజెపికి ఫ్లోర్ లీడర్లే దొరకడం లేదట. గతంలో ఎన్నడూ లేనివిధంగా 48మంది కార్పొరేటర్లు గెలిచిన గ్రేటర్ ఆఫీస్ లో వారిని లీడ్ చేసే లీడరే కనిపించడం లేదట. ఈ సారి అవకాశం సీనియర్లకు ఇవ్వాలా జూనియర్లకు కట్టబెట్టాలా అన్న కన్ఫ్యూజన్లో కాషాయం పార్టీ  క్లారిటీ మిస్ అవుతుందట. హైదరాబాద్ నేతల అభ్యంతరాలతో ఫ్లోర్ లీడర్ ఎంపికను అలా అటకెక్కించిన అధిష్టానంపై కలం కార్పొరేటర్లు ఏమంటున్నారు? కిందటేడాది గ్రేటర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ని కమలనాథులు ఖంగు తినిపించారు. హైదరాబాదులో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం ఉన్న బిజెపి ఎంఐఎం, టిఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడుతూ తన సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా 48 డివిజన్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఇక గ్రేటర్ హైదరాబాద్లో ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటామని అధికార పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతామంటూ అప్పట్లో కమలనాథులు బాగానే చెప్పారు. కానీ ఇంతవరకు గ్రేటర్ లో గెలుపొందిన కార్పొరేటర్ లను లీడ్ చేసేందుకు ఓ ఫ్లోర్ లీడర్ ని మాత్రం ఎంపిక చేయలేకపోతోంది.

 ఫ్లోర్ లీడర్ కోసం ఎంతోమంది రెడీగా ఉన్నారు. కమలం నుంచి గెలిచిన వారే కాకుండా  ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎంతోమంది కార్పొరేటర్లు ఖర్చిఫ్ వేసుకుని కూర్చున్నారు. అయితే ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్న కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం అడుగు ముందుకు వేయాలంటే ఆలోచిస్తోందట . ముఖ్యంగా కొత్త పాత నేతల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా సమన్వయం కోసం ప్రయత్నిస్తోందట. కమలం లీడర్లు కీలకమైన ఫ్లోర్ లీడర్ ని ఎంపిక చేయలేకపోతున్నారని  విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగూ అందరినీ సాటిస్పై చెయ్యడం ఇంపాజిబుల్ కాబట్టి అందరినీ కలుపుకుపోయే నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంచనాతో కమలం క్యాంపు ఉంటే ఈ ఎంపిక ఎంత ఆలస్యం చేస్తే అంత పార్టీకే నష్టం అన్న అంచనాలో కార్పోరేటర్లు ఉన్నారట. ఎవరెన్ని చెప్పినా డెసిషన్ తీసుకునేది పార్టీ అధినాయకత్వమే.



బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>