MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/koratala-siva21f89a3e-b913-4393-ad3f-25142ebf2e3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/koratala-siva21f89a3e-b913-4393-ad3f-25142ebf2e3d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు కొరటాల శివ. అయితే సుమారు ఐదేళ్ల క్రితమే చిన్న సినిమాలకు సమర్పకుడిగా, నిర్మాతగా ఎదగాలని కొరటాల శివ ఆశపడ్డాడు. కానీ కొరటాల శివకు ఆ సమయం దొరకలేదు. తాను నిర్మాతగా మారడానికి ఆ మధ్య ఓ కథ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇక ఆ సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. తను డైరెక్ట్ చేస్తున్న ఆచార్య సినిమాకి మధ్యలోనే బ్రేక్ పడింది. దీంతో సెకండ్ వేవ్ అనంతరం ఆచార్య సినిమా పనుల్లోనే బిజీగా మారిపోయాడు కొరటాల శివ. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తన నిర్Koratala Siva{#}aishwarya rajesh;bhama;adhithya;Writer;Yuva;December;koratala siva;NTR;vamsi;Darsakudu;Director;Tollywood;Cinema;Coronavirusఎట్టకేలకు కొరటాల శివ కల నెరవేరబోతోంది..!!ఎట్టకేలకు కొరటాల శివ కల నెరవేరబోతోంది..!!Koratala Siva{#}aishwarya rajesh;bhama;adhithya;Writer;Yuva;December;koratala siva;NTR;vamsi;Darsakudu;Director;Tollywood;Cinema;CoronavirusTue, 16 Nov 2021 17:08:13 GMTప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు కొరటాల శివ. అయితే సుమారు ఐదేళ్ల క్రితమే చిన్న సినిమాలకు సమర్పకుడిగా, నిర్మాతగా ఎదగాలని కొరటాల శివ ఆశపడ్డాడు. కానీ కొరటాల శివకు ఆ సమయం దొరకలేదు. తాను నిర్మాతగా మారడానికి ఆ మధ్య ఓ కథ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇక ఆ సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. తను డైరెక్ట్ చేస్తున్న ఆచార్య సినిమాకి మధ్యలోనే బ్రేక్ పడింది. దీంతో సెకండ్ వేవ్ అనంతరం ఆచార్య సినిమా పనుల్లోనే బిజీగా మారిపోయాడు కొరటాల శివ. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తన నిర్మాణం లో రాబోతున్న ఓ చిన్న సినిమాకి కొరటాల శివ సమయం కేటాయించాడు.

 ఈ సినిమాలో మంచి మ్యాటర్ ఉందని అంటున్నారు. పైగా ఈ చిన్న సినిమాకు కొరటాల శివ మాటలు కూడా రాస్తున్నాడట. కాకపోతే సినిమా కథ మాత్రం కొత్త రచయితది. అయితే కొరటాల శివ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో కాస్తోకూస్తో భాగస్వామి గా ఉండాలని యు.వి క్రియేషన్స్ అధినేత వంశీ కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కానీ అతను ఏంటర్ అయితే ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని కొరటాల శివ  సోలో నిర్మాతగా ఈ సినిమా తీయబోతున్నాడు. ఇక ఈ సినిమాని గోపాలకృష్ణ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. యువ హీరో ఆదిత్య అరుణ్ హీరోగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అతని సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించనుంది.

 ఇక ఈ సినిమా ఒక ముదురు భామ స్టోరీ అని తెలుస్తోంది. కథలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. ఇక అన్నింటికీ మించి కొరటాల శివ ఈ సినిమాకి నిర్మాత, అలాగే మాటల రచయిత కూడానూ. కాబట్టి జనాల్లో కచ్చితంగా ఈ సినిమాకి మంచి హైప్ ఉంటుంది. ఇక త్వరలోనే ఈ చిన్న సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైప కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ - కొరటాల మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది...!!



ఎట్టకేలకు కొరటాల శివ కల నెరవేరబోతోంది..!!

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!

వైరల్ వీడియో : స్నేహమంటే ఇదేరా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>