PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr28491806-662d-4eed-b652-5f4b290ab380-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr28491806-662d-4eed-b652-5f4b290ab380-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు రాజకీయం బాగా వేడెక్కింది. ధాన్యం కొనుగోళ్ల అంశం అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఆ మాటల యుద్దం కాస్తా ఇప్పుడు రాళ్ల దాడుల వరకూ వెళ్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల పర్యటన పలు ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్ ఎక్కడకు వెళ్తే అక్కడ టీఆర్ ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోటా టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. చివKCR{#}Revanth Reddy;Suryapeta;KCR;Congress;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;CMరేవంత్ కంటే.. బండి బెటర్.. కేసీఆర్ ఐడియా ఇదేనా..?రేవంత్ కంటే.. బండి బెటర్.. కేసీఆర్ ఐడియా ఇదేనా..?KCR{#}Revanth Reddy;Suryapeta;KCR;Congress;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;CMTue, 16 Nov 2021 07:30:31 GMTతెలంగాణాలో ఇప్పుడు రాజకీయం బాగా వేడెక్కింది. ధాన్యం కొనుగోళ్ల అంశం అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఆ మాటల యుద్దం కాస్తా ఇప్పుడు రాళ్ల దాడుల వరకూ వెళ్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల పర్యటన పలు ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్ ఎక్కడకు వెళ్తే అక్కడ టీఆర్ ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి.


బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోటా టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. చివరకు చిట్టేపల్లి వద్ద ఏకంగా బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ సంఘటనలను యాదృశ్చికంగా జరిగిన సంఘటనలు చూడకూడదంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద దాదాపు వారం రోజుల నుంచి తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది రాజకీయం. హుజూరాబాద్ ఎన్నికల ఫలితం వెలువడినప్పటి నుంచి ఇదే సీన్ కంటిన్యూ అవుతోంది.


ఈ పరిణామాల వెనుక సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్‌లో పెద్దల అండదండలు లేనిదే.. బండి సంజయ్‌ కాన్వాయ్‌ పై రాళ్లు పడే పరిస్థితి ఉండదు. అందులోనూ ఉదయం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే రాత్రికి రాళ్ల దాడి  జరిగిందంటే.. అదంతా పెద్దలకు తెలిసే జరిగి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఈ ఘటనల ద్వారా బండి సంజయ్‌ గ్రాఫ్ పెరుగుతోంది.


టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు కావాల్సింది కూడా అదే.. తెలంగాణలో బీజేపీ కి పెద్దగా క్యాడర్ లేదు.. ఆ పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగినా కొత్తగా వచ్చే సీట్లు పరిమితంగానే ఉంటాయి. అదే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగితే టీఆర్ఎస్‌ అధికారానికే ప్రమాదం. అందుకే కేసీఆర్ కావాలనే బండి సంజయ్‌ గ్రాఫ్ పెంచే ప్రయత్నాలు చేస్తుండవచ్చు.. రేవంత్ రెడ్డి ఎదగడానికి కంటే.. బండి సంజయ్ ఎదిగితేనే టీఆర్ఎస్‌కు లాభం అని కేసీఆర్ భావిస్తుండొచ్చు.





రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>