MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/our-heroes-chanting-the-fitness-mantra-1f1edb01-fdca-49a0-8931-722c7c94a065-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/our-heroes-chanting-the-fitness-mantra-1f1edb01-fdca-49a0-8931-722c7c94a065-415x250-IndiaHerald.jpgఇన్నాళ్లూ పాన్ ఇండియన్ మూవీస్‌ అంటే యూనివర్సల్ స్టోరీస్‌ కావాలి. కథా బలం ఉండాలి.. అప్పుడే కలెక్షన్లు బాగుంటాయని అంతా అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కథతో పాటు కండబలం కూడా ఉండాలనుకుంటున్నారు తెలుగు స్టార్స్. అందుకే ముంబయి వెళ్తోన్న హీరోలంతా జిమ్ లలో తెగ కష్టపడతున్నారు. బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. Our heroes chanting the fitness mantra {#}kiran;varun tej;Mass;Rajamouli;Reddy;Tamil;Devarakonda;Hero;Hindi;ram pothineni;Cinemaఫిట్ నెస్ మంత్రం జపిస్తున్న మన హీరోలు..!ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్న మన హీరోలు..!Our heroes chanting the fitness mantra {#}kiran;varun tej;Mass;Rajamouli;Reddy;Tamil;Devarakonda;Hero;Hindi;ram pothineni;CinemaTue, 16 Nov 2021 12:30:00 GMTఫిట్‌నెస్‌కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో ముందుంటాడు రామ్ చరణ్. ఎక్కడికెళ్లినా వర్కవుట్స్‌ని విడిచిపెట్టని ఈ హీరో 'ధృవ'లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించి ఫ్యాన్స్‌కి ఫిట్‌నెస్‌ గోల్‌ సెట్ చేశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో 'ట్రిపుల్‌ ఆర్' కోసం చరణ్ మరింత ఫిట్‌గా తయారయ్యాడు. ఇక చరణ్‌ సిక్స్‌ప్యాక్ లుక్స్‌కి మెగారెస్పాన్స్ వచ్చింది. జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో ప్రతీ టర్నింగ్‌ పాయింట్‌లో రాజమౌళి కనిపిస్తాడు. 'ట్రిపుల్‌ ఆర్'తో పాన్‌ ఇండియన్‌ లెవల్‌కి తీసుకెళ్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం తారక్‌ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. ఫారెన్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కోచింగ్‌లో బాడీ బిల్డర్‌లా మారాడు.

విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాక్సింగ్‌ చాంపియన్‌లా నటిస్తున్నాడు విజయ్. ఇక ఈ మూవీ కోసం థాయిలాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నాడు విజయ్. అలాగే రియల్‌ బాక్సర్‌లా కనిపించడానికి జిమ్‌లో గంటలకొద్దీ కష్టపడ్డాడు. రామ్‌ కెరీర్‌లోనే లింగుసామి సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమా హిందీలో కూడా విడుదలయ్యే అవకాశముంది. ఇక ఈ ఫస్ట్‌ మల్టీలింగ్వల్‌లో యూనిక్‌గా కనిపించడానికి కండలు పెంచుతున్నాడు రామ్. ఈ ప్రాసెస్‌లో రామ్‌కి గాయం కూడా అయ్యింది. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు రెగ్యులర్ లుక్‌లోనే కనిపించాడు. మాస్ రోల్స్‌ చేసినా మజిల్డ్‌ బాడీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేస్తోన్న 'గని' సినిమా కోసం హెవీ వర్కవుట్స్ చేశాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి బాడీ బిల్డర్‌లా తయారయ్యాడు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ 'ఏజెంట్' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం అఖిల్‌. కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. ఆల్రెడీ సిక్స్‌ప్యాక్ ఉన్న ఈ హీరో, 'ఏజెంట్‌' కోసం మరింత కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ రెస్పాన్స్ కూడా అందుకుంటున్నాడు. స్టిల్స్‌తోనే 'ఏజెంట్‌'పై అంచనాలు పెంచాడు అఖిల్.





ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా

ఈటెలకు స్ట్రోక్ మొదలైందా...?

తన భర్త పని కోసం... వేడుకుంటున్న కాజల్..!

గులాబ్ తో నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్టప‌రిహారం

ర‌జ‌నీ వెన‌క ఉన్న ఆ షాడో ఎవ‌రు..?

ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ

ఏం కేసీఆర్ తలలు నరుకుతావా...?

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రారు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>