PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/maha-padayatrad9335aae-e581-450b-89de-920ead3242fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/maha-padayatrad9335aae-e581-450b-89de-920ead3242fc-415x250-IndiaHerald.jpgసేవ్ అమరావతి... ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన అంశం. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజువారి విచారణ ఓ వైపు సాగుతోంది. ఇదే సమయంలో సేవ్ అమరావతి అంటూ న్యాయస్థానం టూ దేవస్థానం అంటున్న అమరావతి రైతులు మరోవైపు. 400 కిలోమీటర్లకు పైగా దూరం 157 మంది రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని... ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ పాదయాత్రకు ఇప్పటికే అనూహ్య స్పందన వస్తోంది. గ్రామాల్లో ప్రజలు, రైతులు Padayatra{#}Maha;Nellore;Guntur;Prakasam;Somu Veerraju;Amit Shah;Telugu Desam Party;Amaravati;YCP;Yatra;court;Minister;central government;Party;TDP;Bharatiya Janata Party;Andhra Pradeshఅమరావతి మైలేజ్ కోసం బీజేపీ పాట్లు....!అమరావతి మైలేజ్ కోసం బీజేపీ పాట్లు....!Padayatra{#}Maha;Nellore;Guntur;Prakasam;Somu Veerraju;Amit Shah;Telugu Desam Party;Amaravati;YCP;Yatra;court;Minister;central government;Party;TDP;Bharatiya Janata Party;Andhra PradeshTue, 16 Nov 2021 11:36:59 GMTసేవ్ అమరావతి... ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన అంశం. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజువారి విచారణ ఓ వైపు సాగుతోంది. ఇదే సమయంలో సేవ్ అమరావతి అంటూ న్యాయస్థానం టూ దేవస్థానం అంటున్న అమరావతి రైతులు మరోవైపు. 400 కిలోమీటర్లకు పైగా దూరం 157 మంది రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని... ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ పాదయాత్రకు ఇప్పటికే అనూహ్య స్పందన వస్తోంది. గ్రామాల్లో ప్రజలు, రైతులు పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారు. రైతులకు, పాదయాత్ర చేస్తున్న మహిళలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు. అటు మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ యాత్రకు తన వంతుగా విరాళాలు సేకరించి ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్రలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఇప్పుడు ఇదే పాదయాత్ర రాజకీయ విమర్శలకు దారి తీసింది కూడా. వైసీపీ నేతలు ఏమో ఇది పెయిడ్ ఆర్టిస్టుల యాత్ర అని ఆరోపిస్తున్నారు. ఈ యాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ పాదయాత్రకు వస్తున్న మద్దతుపై మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. రైతుల యాత్రకు మద్దతు ఉంటుందని మొదట్లో ప్రకటించారు. అలాగే ఈ పాదయాత్రలో తొలి నాళ్లలో ఒకరిద్దరు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ఎవరూ కనిపించటం లేదు. ఇదే ఇప్పుడు పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగ్రహానికి కారణమైంది. పాదయాత్రకు ఎందుకు దూరంగా ఉన్నారని రాష్ట్ర నేతలను షా ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి నగరానికి బీజేపీ పూర్తి మద్దతు ఉందన్నారు అమిత్ షా. అందుకే రైతులు చేపట్టిన పాదయాత్రకు కూడా బీజేపీ మద్దతు ఇవ్వాలని... యాత్రలో కమలం పార్టీ నేతలు కూడా పాల్గొని రైతులకు సంఘీభావం తెలపాలని ఆదేశించారు అమిత్ షా. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు షా. పార్టీ నేతలపై సామాజిక ముద్ర వేయడం ఏమిటని కూడా నిలదీశారు అమిత్ షా.





నమ్రతా నిర్మాత అవుతున్నారా...? కొడుకుతోనే ఫస్ట్ సినిమా...?

ఈటెలకు స్ట్రోక్ మొదలైందా...?

గులాబ్ తో నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్టప‌రిహారం

ర‌జ‌నీ వెన‌క ఉన్న ఆ షాడో ఎవ‌రు..?

ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ

ఏం కేసీఆర్ తలలు నరుకుతావా...?

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రారు

ఢిల్లీ కొంప ముంచిన దీపావళి...?

హైదరాబాద్ లో ఆ రెండు శవాలు ఎక్కడివి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>