PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------------e02bba7d-8797-4253-9fa9-cb8df55f8ba4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------------e02bba7d-8797-4253-9fa9-cb8df55f8ba4-415x250-IndiaHerald.jpgస్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు, అక్కడే నిరసన తెలిపేందుకు వచ్చిన టీఆర్ఎస్ వర్గం వారు ఘర్షణ ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.అంతకుముందు చివ్వెంలలో కూడ ఇదే పరిస్థితి త‌లెత్తిన‌ది. అక్క‌డ కూడ పోలీసులు అడ్డుకున్నారు. జ‌న‌గాం జిల్లా కోడ‌కండ్ల మండ‌లం మొండ్రాయిలో కూడ తీవ్ర ఉద్రిక్త‌త వాతావర‌ణం నెల‌కొన్న‌ది. బండి సంజ‌య్ అక్క‌డ ప‌ర్య‌టించడంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు బండి సంజ‌య్ గో బ్యాక్ అంట#బీజేపీ; టీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడి{#}Atmakur;Gharshana;Suryapeta;Traffic police;police;Nalgonda;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Districtబండి సంజయ్‌ పర్యటనలో మళ్లీ హైటెన్షన్..! బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడిబండి సంజయ్‌ పర్యటనలో మళ్లీ హైటెన్షన్..! బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడి#బీజేపీ; టీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడి{#}Atmakur;Gharshana;Suryapeta;Traffic police;police;Nalgonda;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;DistrictTue, 16 Nov 2021 17:53:47 GMTతెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన మరొక‌సారి ఉద్రిక్తంగా మారిన‌ది.  మరోసారి టీఆర్ఎస్ శ్రేణులు  బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు య‌త్నించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఇవాళ‌ ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెలకొన్న‌ది. టీఆర్ఎస్, బీజేపీ వర్గాల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు రాళ్లు రువ్వుకున్నారు. పర్యటనలో భాగంగా బండి సంజయ్ ఆత్మకూర్(ఎస్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకొన్నారు. ఈ త‌రుణంలోనే బండి సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేప‌ట్టారు.

స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు, అక్కడే నిరసన తెలిపేందుకు వచ్చిన టీఆర్ఎస్ వర్గం వారు  ఘర్షణ ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.అంతకుముందు చివ్వెంలలో కూడ  ఇదే పరిస్థితి త‌లెత్తిన‌ది. అక్క‌డ  కూడ పోలీసులు అడ్డుకున్నారు. జ‌న‌గాం జిల్లా కోడ‌కండ్ల మండ‌లం మొండ్రాయిలో కూడ తీవ్ర ఉద్రిక్త‌త వాతావర‌ణం నెల‌కొన్న‌ది. బండి సంజ‌య్ అక్క‌డ ప‌ర్య‌టించడంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు బండి సంజ‌య్ గో బ్యాక్ అంటూ నినాదాల‌తో నిర‌స‌న నిర్వ‌హించారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పోటాపోటీగా నినాదాలు చేసారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం సంభ‌వించిన‌ది.

  దీంతో ఆత్మకూరు (ఎస్‌)లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న‌ది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించడంతో  వారిని చెదరగొట్టారు పోలీసులు. ఈ  త‌రుణంలో పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. మ‌రో వైపు బండి సంజ‌య్ పై ఇప్ప‌టికే  న‌ల్ల‌గొండ‌రూర‌ల్, మాడగులపల్లి, వేములపల్లి పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదు అయిన‌ట్టు న‌ల్గొండ ఎస్పీ వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో బండిసంజ‌య్ న‌ల్ల‌గొండ జిల్లాలో అనుమ‌తి లేకుండా ప‌ర్య‌టించ‌డం మూలంగా కేసు న‌మోదు చేసినట్టు స్ప‌ష్టం చేసారు ఎస్పీ.





మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>