PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dharmanac29303e7-707c-4cb4-ad4c-47f7d792eded-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dharmanac29303e7-707c-4cb4-ad4c-47f7d792eded-415x250-IndiaHerald.jpgప్రభుత్వ విధానాలు, పనులు జరుగుతున్న తీరు, ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేగా పనుల్లో శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు ధర్మాన. అసలు నరేగా లక్ష్యాలే జిల్లాలో నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు ధర్మాన ప్రసాదరావు. నరేగా పనులను కేవలం పరువు కోసం మాత్రమే చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలకు ఏ మాత్రం పొంతన లేకుDharmana{#}DHARMANA PRASADA RAO;Panchayati;Srikakulam;Assembly;Y. S. Rajasekhara Reddy;YCP;Government;District;Minister;Telangana Chief Minister;Partyబిల్లులు సరిపోవడం లేదన్న ధర్మాన...!బిల్లులు సరిపోవడం లేదన్న ధర్మాన...!Dharmana{#}DHARMANA PRASADA RAO;Panchayati;Srikakulam;Assembly;Y. S. Rajasekhara Reddy;YCP;Government;District;Minister;Telangana Chief Minister;PartyTue, 16 Nov 2021 18:53:05 GMTప్రభుత్వ విధానాలు, పనులు జరుగుతున్న తీరు, ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేగా పనుల్లో శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు ధర్మాన. అసలు నరేగా లక్ష్యాలే జిల్లాలో నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు ధర్మాన ప్రసాదరావు. నరేగా పనులను కేవలం పరువు కోసం మాత్రమే చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో సిక్కోలు జిల్లా వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం కేవలం ప్రస్తుతం చెల్లిస్తున్న రేట్లే అన్నారు ధర్మాన. అసలు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో అధికారులకు తెలియదా అని కూడా వ్యాఖ్యానించారు. ఏ మాత్రం పొంతన లేని ధరలతో ఎలా పనులు చేయాలని నిలదీశారు కూడా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ప్రస్తుతం చెల్లిస్తున్న రేట్లపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరగాలని కూడా ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లోని సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక రేట్లకు నరేగా రేట్లకు పొంతన లేదన్నారు. ఆ రేట్లతో  పనులు అసాధ్యమన్నారు ధర్మాన ప్రసాదరావు. పనులు పనులు నిర్వహించడంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడి పోయిందన్నారు ధర్మాన. పొంతన లేని విధంగా ఎస్ఎస్ఆర్ రేట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా కూడా సక్రమంగా లేదని ఆరోపించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. కేవలం పరువు కోసమే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పనులు చేస్తున్నారన్నారు ధర్మాన. అటు కాంట్రాక్టర్లు కూడా నష్టాలతో ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఇంజినీర్లపై ఒత్తిడి చేస్తే పనులు జరగవన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ఇప్పటికే రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ధర్మాన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుందామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారన్నారు. కొందరు అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారని... అందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి స్వయంగా తీసుకువెళ్తా అని... వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.





పరిమితికి మించి అప్పులు చేశారు !!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>