MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-couples28ce807f-e4ca-4bce-89ce-270d38af65a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-couples28ce807f-e4ca-4bce-89ce-270d38af65a7-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య "జోష్" సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. "ఏమాయ చేసావే" సినిమాతో అటు నాగ చైతన్య కెరియర్..డెబ్యూ హీరోయిన్ గా పరిచయమయిన సమంత కెరియర్ ఇద్దరివీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయి. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి రికార్డులను బ్రేక్ చేసింది.TOLLYWOOD-COUPLES{#}sam;Sam Mendes;Romantic;prema;media;marriage;Samantha;News;Naga Chaitanya;Tollywood;Audience;Love;Heroine;Cinema"చై - సామ్"ల జంటకు దిష్టి తగిలింది...అందుకే ఇలా?"చై - సామ్"ల జంటకు దిష్టి తగిలింది...అందుకే ఇలా?TOLLYWOOD-COUPLES{#}sam;Sam Mendes;Romantic;prema;media;marriage;Samantha;News;Naga Chaitanya;Tollywood;Audience;Love;Heroine;CinemaTue, 16 Nov 2021 18:00:00 GMTఅక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య "జోష్" సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. "ఏమాయ చేసావే" సినిమాతో అటు నాగ చైతన్య కెరియర్..డెబ్యూ హీరోయిన్ గా పరిచయమయిన సమంత కెరియర్ ఇద్దరివీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయి. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి రికార్డులను బ్రేక్ చేసింది. చైతన్య, సమంతల కెరియర్ లో ఒక మైలు రాయిగా మిగిలింది. ఈ సినిమా వారి కెరియర్ కే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా చాలా స్పెషల్. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే చైతు, సామ్ ల ప్రేమాయణం మొదలయ్యింది. దాదాపు ఏడేళ్లపాటు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఆ సమయంలో ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చై చాలా కష్టపడ్డారని వార్తలు వినిపించాయి. ఎలాగోలా చివరికి ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి ఈ రొమాంటిక్ కపుల్ ఏమి చేసినా సంచలనంగా మారుతూ వచ్చింది. ప్రేక్షకులు అందరి దృష్టి ఈ జంట పైనే ఉండేది. టాలీవుడ్ లో క్రేజీ సెలబ్రిటీ జంటగా వీరికి గొప్ప ఆదరణ కూడా దక్కింది. సమంత చైతుపై తన  ప్రేమకు గుర్తుగా మూడు టాటూలు కూడా వేయించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలు చేస్తూ అటు సామ్, ఇటు చైతు ఇద్దరు బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీరి ఫోటోలతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేవారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని పరిణామం ఒక్కసారిగా అన్ని గుర్తులను చెరిపేసింది. వీరి జంటకు దిష్టి తగిలినట్లు అంతా తలక్రిందులు అయిపోయింది.

అయితే అన్ని అవాంతరాలను దాటుకుని ఆర్నెల్లు నిరీక్షించి ప్రేమ బలం తో  ఒక్కటైన ఈ జంట.... అయిదేళ్ళు వివాహ బంధం తరవాత పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకుని విడిపోయారు. టాలీవుడ్ నే షేక్ చేసిన ఈ వార్త సమంత తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని అనే ఇంటి పేరును తీసేసినప్పటి నుండి మొదలయ్యింది. చివరికి సమంత సోషల్ మీడియా ద్వారా తాము విడిపోతున్న విషయం నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఆ తరవాత చైతు కూడా విడాకుల విషయంపై ఓపెన్ అయ్యారు. దాంతో వీరి విడాకులకు కారణాలు ఇవే అంటూ చాలా కథనాలే వినిపించాయి.  
చివరికి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా  వారి సినీ లైఫ్ లో మళ్ళీ బిజీ అయిపోయారు. ఇప్పటికీ వీరు విడిపోయారు అన్న వార్తను నమ్మడానికి కష్టం గానే ఉంది. కానీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదుగా!



మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>