MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/will-the-cm-give-the-green-signal-in-the-case-of-rrr8f3e673b-8e85-4262-b51c-a98b37bcba70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/will-the-cm-give-the-green-signal-in-the-case-of-rrr8f3e673b-8e85-4262-b51c-a98b37bcba70-415x250-IndiaHerald.jpgట్రిపుల్‌ ఆర్' దర్శక నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని కి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారనే వార్తలను ఖండించాడు నిర్మాత డి.వి.వి.దానయ్య. టిక్కెట్ రేట్ల తగ్గింపు కారణంగా 'ట్రిపుల్‌ ఆర్' వసూళ్లు భారీగా పడిపోయే ప్రమాదముంది. అలాగని ధరలు పెంచలని న్యాయస్థానానికి వెళ్లేదిలేదని.. కేవలం చర్చలతోనే తమ సమస్యలను పరిష్కరించుకుంటామని చెబుతున్నాడు దానయ్య. Will the CM give the green signal in the case of rrr{#}Konidela Production;Janasena;Government;Industries;Chitram;Rajamouli;Jr NTR;Reddy;producer;Producer;Cinema;Andhra Pradeshట్రిపుల్ ఆర్ విషయంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?ట్రిపుల్ ఆర్ విషయంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?Will the CM give the green signal in the case of rrr{#}Konidela Production;Janasena;Government;Industries;Chitram;Rajamouli;Jr NTR;Reddy;producer;Producer;Cinema;Andhra PradeshTue, 16 Nov 2021 10:00:00 GMTఏపీ ప్రభుత్వం గతేడాది సమ్మర్ లో సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించేసింది. 50, 100 రూపాయలున్న టికెట్లని 10, 20, 30 రూపాయలకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి టికెట్‌ రేట్లు పెంచాలనీ, కరోనాతో నష్టపోయిన సినీ పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలని టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చాలాసార్లు డిస్కస్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు మాత్రం పెరగలేదు.  

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఇది. నందమూరి, కొణిదెల హీరోలు తొలిసారి కలిసి చేసిన ఈ సినిమా కోసం దానయ్య 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. దీంతో థియేట్రికల్ బిజినెస్ 500 కోట్లకి పైగా జరిగితేనే నిర్మాత సేఫ్‌ అవుతాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ రేట్లు తగ్గించడంతో అక్కడ థియేట్రికల్ రైట్స్‌ని తక్కువకి అడుగుతున్నారు బయ్యర్లు.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్‌ రేట్లు పెరగకపోతే 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాతలు భారీ నష్టాల్లో మునిగే ప్రమాదముంది. అందుకే ఏపీలో టికెట్‌ రేట్లు పెంచాలంటూ దానయ్య కోర్టుకెళ్తున్నాడనే ప్రచారం మొదలైంది. అయితే దానయ్య మాత్రం పోరాటాలు లాంటివి చేయడం లేదనీ.. మరోసారి ఏపీ సీయం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి సమస్యని విన్నావిస్తానని చెబుతున్నాడు. ఏపీలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంతో ఢీకొడుతోన్న టీడీపీ, జనసేన పార్టీలకి చెందిన హీరోలు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేశారు. టీడీపికి జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తే, రామ్‌ చరణ్‌ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కి మద్దతు పలికాడు. మరి ఏపి ప్రభుత్వంతో ఫైట్‌ చేస్తోన్న ఈ రెండు పార్టీలకి చెందిన స్టార్స్‌ సినిమాకి అనుకూలమైన జీవో వస్తుందా లేదా అనేది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చూద్దాం... అసలు ఏం జరుగుతుందో.





వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళా మృతి

బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!

బాబులో కుప్పం ఓట‌మి భ‌యం..?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>