TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-54c7530b5-a961-45e4-befd-72e5b1d31e61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-54c7530b5-a961-45e4-befd-72e5b1d31e61-415x250-IndiaHerald.jpgఈ వారం నామినేషన్ చాలా గమ్మత్తుగా జరిగింది. జల్ తో జలకలాడారు ఇంటి సభ్యులు. ఒక్క రవి తప్ప మిగిలిన వారందరికీ ఆ భాగ్యం దక్కింది సుమా..!! కాకపోతే ప్రతి వారంలా కాకుండా ఈసారి నామినేషన్ ప్రక్రియ పెద్దగా వివాదాలు లేకుండా కాస్త కూల్ గా జరిగింది. పదోవారం కంప్లీట్ చేసుకుని 11 వ వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆట మరింత రసవత్తరంగా మారేందుకు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను బాగానే ప్లాన్ చేశారు.TELUGU-BIGG-BOSS-SEASON-5{#}kajal aggarwal;ravi anchor;siri;GEUM;Bigboss;mediaబిగ్ బాస్ 5: షణ్ముఖ్ ఏంట్రా ఇది... "టాప్ 5" కష్టమే?బిగ్ బాస్ 5: షణ్ముఖ్ ఏంట్రా ఇది... "టాప్ 5" కష్టమే?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}kajal aggarwal;ravi anchor;siri;GEUM;Bigboss;mediaTue, 16 Nov 2021 20:00:00 GMTఈ వారం నామినేషన్ చాలా గమ్మత్తుగా జరిగింది. జల్ తో జలకలాడారు ఇంటి సభ్యులు. ఒక్క రవి తప్ప మిగిలిన వారందరికీ ఆ భాగ్యం దక్కింది సుమా..!! కాకపోతే ప్రతి వారంలా కాకుండా ఈసారి నామినేషన్ ప్రక్రియ పెద్దగా వివాదాలు లేకుండా కాస్త కూల్ గా జరిగింది. పదోవారం కంప్లీట్ చేసుకుని 11 వ వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆట మరింత రసవత్తరంగా మారేందుకు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను బాగానే ప్లాన్ చేశారు. కానీ కంటెస్టెంట్స్.. ప్రతి సారి ఏమని వాదించుకుంటాం. ఈసారి కాస్త గొడవలకు బ్రేక్ ఇద్దం అనుకున్నారో ఏమో కానీ పెద్దగా ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వి వైరం పెట్టుకోలేదు. అయితే షన్ను మాత్రం కాజల్ ని మామూలుగా అవమానించలేదు.

నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయని తనతోనే అనేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కానీ కాజల్ మాత్రం ఈసారి చాలా వరకు తనని తాను కంట్రోల్ చేసుకుంది. అవునా ఒకే..నా గురించి నాకు బాగా తెలుసు అంటూ నామినేట్ చేసుకో వెళ్ళు అంటూ కామ్ అయిపోయింది. కానీ షన్ను తనని అలా నేరుగా ఇంట్లో గొడవలు నీ వల్లే వస్తున్నాయి అనడం మాత్రం కాజల్ ఫ్యాన్స్ కే కాదు మిగిలిన వారికి కూడా నచ్చలేదు. నిజానికి షన్నుతో పోలిస్తే కాజల్ బాగానే గేమ్ ఆడుతుంది. ఇక షన్ను నీకు 24/7 సిరి వెనకాల తిరుగడమే సరిపోయింది.

ఇక నువ్వు గేమ్ ఎక్కడ ఆడుతున్నావ్ ఇక పోతే గొడవల గురించి నువ్వే మాట్లాడాలి. చిన్న చినుకును కూడా బూతద్దంలో పెట్టి పెద్ద సునామీలా చూపించి భీత్సం సృష్టిస్తావు. అలాంటిది నువ్వు గొడవలు గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వారం కెప్టెన్ అయిన ఒక్క రవి తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్ లో ఉండడం విశేషం. అయితే గత కొద్ది రోజుల నుండి షణ్ముఖ్ జస్వంత్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల పబ్లిక్ లో హైప్ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే షన్ను ఇలాగే ఉంటె టాప్ 5 లో ఉండడం కూడా కష్టమేనని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.



ఓయో హోటల్‌ బుక్ చేసి 17 ఏళ్ల బాలికపై..?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>