Amazon: అమెజాన్ అడ్డాగా మాదక ద్రవ్యాల సరఫరా, విచారణ ప్రారంభం

Amazon: దేశంలో మాదక ద్రవ్యాల వ్యవహారం ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న పరిస్థితులున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్  వేదికగా మారుతుందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 16, 2021, 11:13 AM IST
  • అమెజాన్ అడ్డాగా మాదక ద్రవ్యాల సరఫరా ఆరోపణలు
  • అంతర్గతంగా విచారణ చేపట్టిన అమెజాన్ ఇండియా సంస్థ
  • మధ్యప్రదేశ్ భిండ్ పోలీసులు అరెస్టు చేసిన ఓ కేసుకు సంబంధించి సాగుతున్న దర్యాప్తు

Trending Photos

Amazon: దేశంలో మాదక ద్రవ్యాల వ్యవహారం ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న పరిస్థితులున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్  వేదికగా మారుతుందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ వేదికలు(E Commerce)మాదక ద్రవ్యాల విక్రయ లావాదేవీలకు వేదికగా మారుతున్నాయా అనే ఆరోపణలు అధికమవుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందనే విమర్శలకు ఈ కామర్స్ వేదికలపై వస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ సంస్థపై(Amazon)వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయ లావాదేవీలకు(Drugs Supply)తమ వేదిక అడ్డాగా మారిందనే ఆరోపణలపై అమెజాన్ ఇండియా అంతర్గత విచారణ ప్రారంభించింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ పోలీసులు ఆన్‌లైన్ మారిజువానా విక్రయాల రాకెట్‌ను ఛేదించింది. ఈ కేసులో అరెస్టైన ఇద్దరి నుంచి 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కామర్స్ వేదిక ద్వారా నిందితులు ఈ రాకెట్ నిర్వహించారని..వచ్చిన లాభాల్లో మూడింట రెండు వంతుల లాభాలు అందినట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల లావాదేవీలకు నిదేకిగా నిల్చినందుకు ఈ కామర్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కామర్స్ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది తీవ్రమైన నేరమని..మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(Norcotics Control Bureau)విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories