PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpbebfecdb-cc71-45a5-9e0c-d94bbd0319e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpbebfecdb-cc71-45a5-9e0c-d94bbd0319e5-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఇక్కడి రాజకీయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రెండంటే రెండు సామాజిక వర్గాల సారథ్యంలోనే మా శ్రీకాకుళం జిల్లా ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉంది. రేపటి వేళ కూడా అలానే నడవబోతోంది. అందుకే అధికార మార్పు అంటే ఇంటి పేరు మారడమే అని తరుచూ ఇక్కడ వినిపించే మాట. కింజరాపు, ధర్మాన, గుండ కుటుంబాల నేతృత్వంలోనే రాజకీయం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం వరకూ ఇదే చెల్లు. అంతేకాదు శ్రీకాకుళం, నరసన్నపేట,టెక్కలి నియోజకవర్గాలతో పాటు ఇంకొన్ని నియోజవర్గాల్లోనూ వెలమ సామాజిక వర్గమే ఆధిపత్యంలో ఉందిycp{#}krishna;Velama;Ram Mohan Naidu Kinjarapu;Deputy Chief Minister;Cabinet;politics;TDP;Yuva;Srikakulam;Jagan;Dookudu;YCP;Minister;central governmentవైబ్రేటింగ్ ఎలర్ట్ : వెలమలే దొరలు ! కాళింగుల్లో కలవరం!వైబ్రేటింగ్ ఎలర్ట్ : వెలమలే దొరలు ! కాళింగుల్లో కలవరం!ycp{#}krishna;Velama;Ram Mohan Naidu Kinjarapu;Deputy Chief Minister;Cabinet;politics;TDP;Yuva;Srikakulam;Jagan;Dookudu;YCP;Minister;central governmentTue, 16 Nov 2021 20:57:30 GMT- అపవాదు కాదు అధికారం కావాలి
- లీడింగ్ కమ్యూనిటీకి దక్కిందెంత?
- వైసీపీలోనూ అవమాన భారం!


రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఇక్కడి రాజకీయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రెండంటే రెండు సామాజిక వర్గాల సారథ్యంలోనే మా శ్రీకాకుళం జిల్లా ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉంది. రేపటి వేళ కూడా అలానే నడవబోతోంది. అందుకే అధికార మార్పు అంటే ఇంటి పేరు మారడమే అని తరుచూ ఇక్కడ వినిపించే మాట. కింజరాపు, ధర్మాన, గుండ కుటుంబాల నేతృత్వంలోనే రాజకీయం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం వరకూ ఇదే చెల్లు. అంతేకాదు శ్రీకాకుళం, నరసన్నపేట,టెక్కలి నియోజకవర్గాలతో పాటు ఇంకొన్ని నియోజవర్గాల్లోనూ వెలమ సామాజిక వర్గమే ఆధిపత్యంలో ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కూడా వెలమలదే అయి ఉంటుంది. గత రెండు ఎన్నికల్లోనూ వెలమలే గెలిచారు. అంతకుమునుపు కాళింగ సామాజికవర్గం నుంచి కిల్లి కృపారాణి గెలిచారు. వాస్తవానికి శ్రీకాకుళం ఎంపీ స్థానం అన్నది ఇక్కడ గెలుచుకోవడం అంత సులువు కాదు. కాళింగుల మద్దతు కూడా కొన్ని సందర్భాల్లో వెలమలకే ఉంటుండంతో వరుసగా ఆ సామాజిక వర్గానికి అభ్యర్థులు అపజయం పాలయ్యారు. 



2014లో కృపారాణి (కాంగ్రెస్), 2019లో కృపారాణి (కాంగ్రెస్), దువ్వాడ శ్రీను (వైసీపీ) వెలమ సామాజికవర్గ యువ నేతపై నెగ్గలేక ఇంటికే పరిమితం అయ్యారు. వాస్తవానికి ఇక్కడి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో నియోజకవర్గంపై మంచి పట్టు పెంచుకున్నారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న తరుణాన కిల్లి కృపారాణి కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. అందుకే అప్పుడు ఆమె అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. అదే సమయంలో రాష్ట్ర విభజన పరిణామాలు ఆమె రాజకీయ ఎదుగుదలకు అడ్డంగా నిలిచాయి. ఇవి మినహాయిస్తే నియోజక వర్గంలో ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇదే సమయంలో యువకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు చాలా ఎదిగారు. తనకంటూ మంచి వ్యక్తిత్వం, నాయకత్వ గుణం ఏర్పరుచుకుని వాటితోనే ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయాల్లోనూ, అదేవిధంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారి సంక్షేమార్థం చేసే పనుల్లోనూ, ఇంకా ఇంకొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన నియోజకవర్గ పరిధి దాటి కూడా ఎంతో మందిని ఆదుకున్నారు. అదే ఇవాళ ఆ కుర్రాడికి శ్రీరామ రక్ష.

ఇక కొత్తగా మరో వాదం వినిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే రెండు అమాత్య పదవులు వెలమలకే కేటాయించాలని కోరుకుంటున్నారు ఆ సామాజిక వర్గ ప్రతినిధులు. ఇది కాస్త ఇబ్బందిగా ఉన్న పరిణామమే! ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి ధర్మాన కృష్ణ దాసు (వెలమ) ను ఎంతగానో గౌరవించారు జగన్. ఇదే సమయంలో మరో  సారి అదే సామాజికవర్గం నుంచి ధర్మాన కృష్ణదాసు సోదరుడు ప్రసాదరావుకు మంచి ప్రాముఖ్యం ఇవ్వాలని తపిస్తున్నారు జగన్. కనుక వెలమలకు రానున్న క్యాబినెట్ లో రెండో మంత్రి పదవి అయితే కేటాయింపు ఇవ్వడం జరగని పని. ఇదే సమయంలో ఇలా కోరుకోవడం తప్పేమీ కాదు అని కూడా కొందరు సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. జగన్ దృష్టిలో కాపు సామాజికవర్గం లేదంటే వెలమ సామాజికవర్గమే ప్రథమ ప్రాధాన్యంలో ఉన్నారని, తమను పట్టించుకోవడం లేదని కాళింగులు అంతర్మథనం చెందుతున్నారు. మొన్నటి ఎమ్మెల్సీలలో తమకు మరో ఎమ్మెల్సీ వస్తే బాగుండేది అని, కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అధ్యక్షురాలు కృపారాణికి ఆ అవకాశం ఇస్తే బాగుండేదన్న వాదన కూడా ఇంకొందరు కాళింగులు వినిపిస్తు న్నారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ గా ఉన్న దువ్వాడ శ్రీను తనదైన దూకుడు స్వభావంతో రాజకీయాలు చేస్తున్నారు. ఇది కాస్త దువ్వాడ కే కాదు రేపటి వేళ వైసీపీకి కూడా ఇబ్బంది పెట్టే పరిణామమే! అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నా జగన్ భయపడిపోతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో వీర విధేయతకు కేరాఫ్ గా ఉన్న సీతారాం కు (ఆయన కూడా కాళింగ సామాజికవర్గ నేత.. ఇంటి పేరు : తమ్మినేని) మంత్రి పదవి ఇస్తే మేలు అని, అసెంబ్లీలో ధర్మాన తరువాత ప్రభుత్వ గొంతుకను బలీయంగా వినిపించే నేత సీతారాం అవుతారని భావిస్తున్నారు సీఎం. సో.. వెలమలకు రెండు మంత్రి పదవులు అన్నవి రావు అలానే కాళింగులకు మరో ఎమ్మెల్సీ రాదు..ఇవీ ఇప్పటి పరిణామాలకు సంబంధించి సంగ్రహ సారాంశం. సమగ్ర వివరం. విశ్లేషణా రూపం.
- రత్నకిశోర్ శంభుమహంతి





కుప్పం టీడీపీ : ధైర్యే సాహసే చంద్రబాబు..!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>