PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇన్నాళ్లకు కేసీఆర్ కు చెమటలు పోయించే ప్రతిపక్షం తయారయ్యింది. ఇకమీదట పోటీ కోసం హడావుడి అంతా ఈ ఇద్దరి మద్యే ఉండేట్టుగానే ఉంది. ఈ విమర్శలు, ప్రతివిమర్శలలో అసలు రాష్ట్రంలో మరో పార్టీ అది కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ చూద్దామన్నా ఎక్కడ కనిపించడం లేదు. బీజేపీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. తెలంగాణాలో కూడా దాదాపుగా అదే జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ను ప్రజలు కాస్త పక్కన పెట్టేస్తే, మిగిలిన కాస్తపని బీజేపీ చేసేసింది. అందుకే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేtelanganacongress;{#}revanth;KCR;Congress;Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata Partyతెలంగాణ : కాంగ్రెస్.. ముచ్చటే లేదే..!తెలంగాణ : కాంగ్రెస్.. ముచ్చటే లేదే..!telanganacongress;{#}revanth;KCR;Congress;Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata PartyTue, 16 Nov 2021 08:36:52 GMTతెలంగాణాలో ఇన్నాళ్లకు కేసీఆర్ కు చెమటలు పోయించే ప్రతిపక్షం తయారయ్యింది. ఇకమీదట పోటీ కోసం హడావుడి అంతా ఈ ఇద్దరి మద్యే ఉండేట్టుగానే ఉంది. ఈ విమర్శలు, ప్రతివిమర్శలలో అసలు రాష్ట్రంలో మరో పార్టీ అది కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ చూద్దామన్నా ఎక్కడ కనిపించడం లేదు. బీజేపీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. తెలంగాణాలో కూడా దాదాపుగా అదే జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ను ప్రజలు కాస్త పక్కన పెట్టేస్తే, మిగిలిన కాస్తపని బీజేపీ చేసేసింది. అందుకే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేపట్టిన నేత కూడా చప్పుడు చేయడం లేదు. డాంబికానికి మాత్రం మల్లొచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుంది అంటూ నెట్టుకొచ్చేస్తున్నాడు రేవంత్.

ప్రయోగాత్మకంగా రేవంత్ కు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ కు కూడా అప్పుడే రాష్ట్రంలో ఫలితాలు వస్తాయని ఆశించి ఉండదు, కారణం ఇక్కడ కూడా ఆ పార్టీకి ప్రధాన పోటీగా ఉంది బీజేపీ మాత్రమే. అందుకే అప్పుడే అధికారం రావడం అంత సులభం కాదని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. కానీ ప్రయత్నం అంటూ ఒకటి ఉండాలి కాబట్టి ఈ తరహా నియామకం చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా బీజేపీ బలపడుతూనే ఉంది, కాంగ్రెస్ కనుమరుగవుతూనే ఉంది. మరో పక్క అధికార తెరాస కూడా స్వయంకృతాపరదాల వలన పక్కన పెట్టబడుతుంది. ఈ తరహా పరిస్థితి కారణంగానే బీజేపీ నాలుగు సీట్లు దక్కించుకుంది.

రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ ప్రభావం ఎక్కువగానే ఉంటుందనేది ఈ ఉపఎన్నిక ఫలితాలతోనే అర్ధం అయిపోయింది. అయినా తమకు ఉన్న అవకాశాలను అధికార పార్టీ పరిశీలించుకుంటూ, ఎలాగైనా కేంద్రంలో బీజేపీని పక్కన పెట్టగలిగితే రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. అందుకే కేసీఆర్ కూడా మళ్ళీ ఫ్రంట్ మాట ఎత్తాడు. అది కూడా అంత సులభంగా ఫలితాన్ని ఇస్తుందా అంటే, కాదు. ప్రజావ్యతిరేకత బీజేపీ కి ఉందా లేక ఉన్నట్టు విపక్షాలు లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ అంశం. దీనిపై ఇటీవల ఉపఎన్నిక కాస్త స్పష్టత ఇచ్చింది. అందుకే బీజేపీ ప్రజావ్యతిరేకత అనే ప్రచారాన్ని తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది.



బాలయ్య సతీమణి వసుంధర ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>