PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6eda8e1a-7918-4b88-b7e3-a4498f8b09ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6eda8e1a-7918-4b88-b7e3-a4498f8b09ae-415x250-IndiaHerald.jpgత్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అయితే సాధ్యమైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ నడపాలని అధికార వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైతే ఒకటి, రెండు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలను ముగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే నిజంగా ఇలా తక్కువ రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే అది వైసీపీకే రాజకీయంగా దెబ్బగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఎదురు లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్యెల్యేలు గెలిచారు. అంతే కాకుండా మరో ముగ్గురjagan{#}Amaravati;Assembly;CBN;Party;YCP;electricity;TDP;Andhra Pradesh151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వైసీపీ భయపడుతోందా..?151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వైసీపీ భయపడుతోందా..?jagan{#}Amaravati;Assembly;CBN;Party;YCP;electricity;TDP;Andhra PradeshTue, 16 Nov 2021 23:33:38 GMTత్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అయితే సాధ్యమైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ నడపాలని అధికార వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైతే ఒకటి, రెండు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలను ముగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే నిజంగా ఇలా తక్కువ రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే అది వైసీపీకే రాజకీయంగా దెబ్బగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఎదురు లేదు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్యెల్యేలు గెలిచారు. అంతే కాకుండా మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే వైసీపీ ఎమ్మెల్యేల్లా ప్రవర్తిస్తున్నారు. ఇంతగా అధికార బలం ఉన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలను అతి తక్కువ రోజులు నిర్వహించే ఆలోచన చేయడం సబబుగా కనిపించడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్షాన్ని చూసి వైసీపీ  భయపడుతోందన్న సంకేతాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఈ అంశంపైనా టీడీపీ
వైసీపీని విమర్శిస్తోంది.


చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ.. కనీసం అసెంబ్లీ సమావేశాలు 15 రోజులైనా  నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం చట్టసభలను అభాసుపాలు చేస్తోందంటున్న : టీడీపీ నాయకులు.. 151 మంది ఉన్నా ప్రతిపక్షాన్ని చూసి అంత భయం ఎందుకని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో జనం అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని.. వాటిపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు  పట్టుబడుతున్నారు. పెట్రో ధరలను కేంద్రం తగ్గించినా రాష్ట్రం తగ్గించలేదని.. రెండున్నర ఏళ్లు దాటినా సీపీఎస్‌ రద్దు చేయలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.


విద్యుత్ చార్జీల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారని.. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడం దారుణమని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే అమరావతి రైతుల పాదయాత్రపైనా అసెంబ్లీలో చర్చించాలని.. మూడు రాజధానుల అంశానికి స్వస్థి పలికి.. ఇకనైనా అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.





అచ్చెన్న..బాబు భలే దెబ్బకొట్టారే!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>