PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-bjp-dk-aruna3de2c994-f2eb-43cb-bf11-eb5cb5a365c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-bjp-dk-aruna3de2c994-f2eb-43cb-bf11-eb5cb5a365c4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో నియంత పరిపాలన కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. నిన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై దాడి జరగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోళ్ల విషయం ఇప్పటికే రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. యాసంగి పంట కోనుగోలు విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో... కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారుaruna{#}West Bengal - Kolkata;Governor;Telangana Rashtra Samithi TRS;central government;KCR;CM;Government;Bharatiya Janata Party;Telangana Chief Minister;Partyదాడుల సూత్రధారి కేసీఆర్ అంటున్న బీజేపీ లీడర్స్...‍!దాడుల సూత్రధారి కేసీఆర్ అంటున్న బీజేపీ లీడర్స్...‍!aruna{#}West Bengal - Kolkata;Governor;Telangana Rashtra Samithi TRS;central government;KCR;CM;Government;Bharatiya Janata Party;Telangana Chief Minister;PartyTue, 16 Nov 2021 14:51:54 GMTతెలంగాణ రాష్ట్రంలో నియంత పరిపాలన కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. నిన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై దాడి జరగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోళ్ల విషయం ఇప్పటికే రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. యాసంగి పంట కోనుగోలు విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో... కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీకే అరుణ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి జరిగిందన్నారు డీకే అరుణ. బండి సంజయ్‌పై దాడులు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తెలంగాణలో కూడా బెంగాల్ తరహా రాజకీయాలకు సీఎం కేసీఆర్ తెర తీశారన్నారు డీకే అరుణ.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక  పోతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. బండి  సంజయ్‌ కాన్వాయ్ పై దాడి విషయాన్ని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు డీకే అరుణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని ఇప్పకిటే కేంద్రం వెల్లడించిందన్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదని... పైగా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కూడా డీకే అరుణ ఆరోపించారు. ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కోనాల్సిన ప్రభుత్వం... రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తే... బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిలకు బీజేపీ భయపడదని హెచ్చరించారు డీకే ఆరుణ.





బాలయ్య unstoppable.. తెరవెనుక జరిగింది ఇదే?

బండి సంజయ్ దెబ్బ రేవంత్ అబ్బా...?

తొమ్మిది నెల‌ల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు..

కుప్పం కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారి..!

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>