PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban79f6d4f5-16d9-42a9-be38-af79cea59ac0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban79f6d4f5-16d9-42a9-be38-af79cea59ac0-415x250-IndiaHerald.jpgతాలిబన్ లు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. తమ దేశంలో పేదరికం తాండవించడానికి ప్రపంచ దేశాలే కారణం అంటున్నారు. తమను గుర్తించకపోవడం వలన తమ పనులు తాము చేసుకోలేకపోతున్నామని అందుకే పరిపాలన సరిగా సాగటం లేదని చెప్పుకొస్తున్నారు. చేతకాక పోతే చేతకాదు అని ఒప్పుకోవాలి కానీ ఇలా అంతర్జాతీయంగా అందరిపైకి ఆఫ్ఘన్ వ్యవహారాన్ని నెట్టేస్తున్నారు తాలిబన్ లు. గతంలో తాలిబన్ లు పాలించినా, ఈసారి ఆ తరహా పరిపాలన కూడా చేయలేకపోతున్నారు. అందుకు కారణం కూడా తెలియనిదేమి కాదు, ఆఫ్ఘన్ ఆక్రమణ అయితే జరిగింది కానీ, దానిపై పెత్తనం ఎవరిది afghanistan;{#}Indiaపరిపాలన చేతకాక.. తాలిబన్ల దబాయింపు..!పరిపాలన చేతకాక.. తాలిబన్ల దబాయింపు..!afghanistan;{#}IndiaTue, 16 Nov 2021 21:34:32 GMTతాలిబన్ లు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. తమ దేశంలో పేదరికం తాండవించడానికి ప్రపంచ దేశాలే కారణం అంటున్నారు. తమను గుర్తించకపోవడం వలన తమ పనులు తాము చేసుకోలేకపోతున్నామని అందుకే పరిపాలన సరిగా సాగటం లేదని చెప్పుకొస్తున్నారు. చేతకాక పోతే చేతకాదు అని ఒప్పుకోవాలి కానీ ఇలా అంతర్జాతీయంగా అందరిపైకి ఆఫ్ఘన్ వ్యవహారాన్ని నెట్టేస్తున్నారు తాలిబన్ లు. గతంలో తాలిబన్ లు పాలించినా, ఈసారి ఆ తరహా పరిపాలన కూడా చేయలేకపోతున్నారు. అందుకు కారణం కూడా తెలియనిదేమి కాదు, ఆఫ్ఘన్ ఆక్రమణ అయితే జరిగింది కానీ, దానిపై పెత్తనం ఎవరిది అనేదానిపై ఇంకా ఐఎస్ కానీ తాలిబన్ లు కానీ ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే అక్కడ ఆ ఉగ్రభూతాల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతూనే ఉంది.

ఇదంతా ఆధిపత్య పోరాటం కాదు, తమను గుర్తించకపోవడం వలన దేశంలో తాము చేయాల్సిన పనులను చేసుకోలేకపోతున్నట్టు కొత్త పాట ఎత్తుకుంటున్నారు. అంటే ఇలా చేస్తే అయినా గుర్తింపు లభిస్తుందనే సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నమాట. ఎన్ని చేసినా ఇక వాళ్ళను పట్టించుకునే వారు ప్రపంచంలో ఆ పాక్, చైనా లు తప్ప మరొకరు ఉండబోరు. ఈ విషయం తెలిసే, కనీసం ఆఫ్ఘన్ ల కోసమైనా ఒప్పుకొండి అని అడిగే ధైర్యం కూడా లేక, వాళ్ళను అడ్డుపెట్టుకొని పరిపాలన చేయలేకపోతున్నాం అంటూ నాటకాలు ఆడుతున్నారు.

ఇంత పరిపాలన చేయలేని వారికి దేశం ఎందుకు, ఇంతోటిదానికి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడం ఎందుకు! వాళ్ళ స్వార్దానికి ఆక్రమణ చేసుకొని, ఇప్పుడు ప్రపంచం ఆఫ్ఘన్ లో ఆకలి చావులు అనే దానిపై స్పందించాలని కోరడంతో దానికి కారణం ప్రపంచం నుండి గుర్తింపు లభించకపోవడమే అంటూ దేని గురించి ఎత్తినా, దాని కాడికే వస్తున్నారు తాలిబన్ లు. అంటే ఇక ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనదు అనే సందేశాన్ని చెప్పకనే చెప్పేశారు. అందుకే ప్రపంచ దేశాలు కూడా దీనిపై స్పందించాల్సి వస్తుంది. ఇక తప్పదు. అందుకే భారత్ కూడా 8 దేశాలతో ఆఫ్ఘన్ వ్యవహారంపై చర్చించింది.



కుప్పం టీడీపీ : అయినోళ్లే ముంచేశారు?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>