PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghurama-krishnam-rajubcd5e683-d5d2-437f-82af-fed0bafd8789-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghurama-krishnam-rajubcd5e683-d5d2-437f-82af-fed0bafd8789-415x250-IndiaHerald.jpgవైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు...అదే పార్టీకి ప్రతిపక్షం మాదిరిగా తయారైన విషయం తెలిసిందే. ఏదో ఎన్నికల తర్వాత కొన్నిరోజులు వైసీపీ వైపు ఉన్నారు. కానీ తర్వాత ప్రభుత్వంలో ఉన్న తప్పులని ఎత్తి చూపే కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. అయితే రఘురామ చెప్పిన తప్పులని జగన్ పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి రఘురామ, పూర్తిగా వైసీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇలా జగన్ ప్రభుత్వం తప్పులని బయటపెRaghuRama Krishnam Raju{#}Amit Shah;Cheque;narasapuram;Narsapur;Jagan;Tirupati;Amith Shah;CBN;Bharatiya Janata Party;YCP;local language;Party;TDPబీజేపీలోకి రఘురామ..వర్కౌట్ అవుతుందా...?బీజేపీలోకి రఘురామ..వర్కౌట్ అవుతుందా...?RaghuRama Krishnam Raju{#}Amit Shah;Cheque;narasapuram;Narsapur;Jagan;Tirupati;Amith Shah;CBN;Bharatiya Janata Party;YCP;local language;Party;TDPTue, 16 Nov 2021 10:21:55 GMTవైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు...అదే పార్టీకి ప్రతిపక్షం మాదిరిగా తయారైన విషయం తెలిసిందే. ఏదో ఎన్నికల తర్వాత కొన్నిరోజులు వైసీపీ వైపు ఉన్నారు. కానీ తర్వాత ప్రభుత్వంలో ఉన్న తప్పులని ఎత్తి చూపే కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. అయితే రఘురామ చెప్పిన తప్పులని జగన్ పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి రఘురామ, పూర్తిగా వైసీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందో కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఇలా జగన్ ప్రభుత్వం తప్పులని బయటపెడుతున్న రఘురామ, చంద్రబాబు డైరక్షన్‌లో పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ వెనక్కి తగ్గకుండా వైసీపీని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు. ఇలా వైసీపీని ముప్పు తిప్పలు పెడుతున్న రఘురామ నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఎక్కువ శాతం ఆయన టీడీపీ లో కే వెళ్లొచ్చని ప్రచారం జరుగుతుంది. లేదా పొత్తులో నరసాపురం ఎంపీ సీటు గానీ జనసేనకు వస్తే...ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని టాక్.

కానీ రఘురామ బీజేపీ వైపు చూస్తున్నట్లు ఎక్కడా ప్రచారం రాలేదు. అయితే తాజాగా తిరుపతి పర్యటన కు వచ్చిన అమిత్ షా...రఘురామని బీజేపీలోకి తీసుకుందామని రాష్ట్ర నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. . జగన్‌ ఎన్నికల హామీలు,  రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆయన గట్టిగా నిలదీస్తున్నారని, కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే మరింత బలం చేకూరుతుంద ని, పైగా వైసీపీ, బీజేపీ ఒకటి కాదనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని స్థానిక నేతలతో అమిత్ షా చెప్పినట్లు సమాచారం.

అయితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పుడు రఘురామని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు అమిత్ షా చెప్పారు కాబట్టి, రఘురామని బీజీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. అయినా రఘురామ బీజేపీలోకి రావడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి.



కుప్పంలో బాబు 30 ఏళ్ల కుప్పి గంతుల‌కు చెక్‌..!

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళ మృతి

బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!

బాబులో కుప్పం ఓట‌మి భ‌యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>