PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsc4e3b34e-c5c9-463f-8d94-29333bcc8afd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsc4e3b34e-c5c9-463f-8d94-29333bcc8afd-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై యుద్ధభేరి మోగించింది. అయితే అది ఎంత ప్రభావం చూపుతుంది అనేది పక్కన పెడితే, అదేదో జరిగిపోతుంది అనే ప్రచారంతో కావచ్చు నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం పై నమ్మకంతో కావచ్చు అధికార వర్గాలు అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామం కూడా కేసీఆర్ కు కలిసి వస్తుందా లేక లేనిపోని ఆవేశాలకు అధికారులు లోనవుతున్నారా అనేది కూడా ఆలోచించాలి. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరులో అధికారులు బలైపోవడం ఇప్పుడేమి కొత్త విషయం కాదు. కానీ అధికారులు కూడా తక్కువ స్థాయి వారేమి కాదు, ఉన్నత kcr-bjp;{#}Service;politics;KCR;Telangana Rashtra Samithi TRS;Party;central governmentకేసీఆర్ కు.. అధికారులు అండగా ఉంటున్నారా..!కేసీఆర్ కు.. అధికారులు అండగా ఉంటున్నారా..!kcr-bjp;{#}Service;politics;KCR;Telangana Rashtra Samithi TRS;Party;central governmentTue, 16 Nov 2021 08:39:32 GMTతెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై యుద్ధభేరి మోగించింది. అయితే అది ఎంత ప్రభావం చూపుతుంది అనేది పక్కన పెడితే, అదేదో జరిగిపోతుంది అనే ప్రచారంతో కావచ్చు నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం పై నమ్మకంతో కావచ్చు అధికార వర్గాలు అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామం కూడా కేసీఆర్ కు కలిసి వస్తుందా లేక లేనిపోని ఆవేశాలకు అధికారులు లోనవుతున్నారా అనేది కూడా ఆలోచించాలి. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరులో అధికారులు బలైపోవడం ఇప్పుడేమి కొత్త విషయం కాదు. కానీ అధికారులు కూడా తక్కువ స్థాయి వారేమి కాదు, ఉన్నత అధికారులు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయడం ద్వారా వారికి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉందని భావించాల్సి వస్తుంది.

ఇలా అధికారులు తెరాస లోకి వరుసకడతారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. అలా జరగడం అధికార పార్టీకి ఎంతవరకు లాభం, అసలు అధికారులు ఒకపార్టీలోకి వచ్చినందున ఆ పార్టీ తీరుతెన్నులు మారిపోతాయా లేక కేవలం అవన్నీ వారికి రాష్ట్రంపై ఉన్న అభిమానాన్ని మాత్రమే చెపుతున్నాయా అనేవి ఇక్కడ అంశాలు. ఒక పార్టీలో ఎవరైనా చేరవచ్చు, అయితే అధికారులు ఆయా పార్టీలలోకి వెళ్లడం అనేది ముందు నుండి ఉన్నదే అయినప్పటికీ, ఇప్పటి పరిస్థితులలో ఈ తరహా పరిణామాలు తెలంగాణాలో కనిపించడం బీజేపీకి కూడా పెద్ద దెబ్బేమీ కాకపోవచ్చు. సాధారణంగా అధికారులు ప్రజా సేవ చేస్తారు, అంటే ప్రజలకు మేలు చేసే పనులు చేస్తూ ఉండటం ద్వారా వారి అవసరాలు తీరుస్తూ ఉంటారు.  ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటారు.

మరి తెలంగాణాలో ప్రజలు తెరాస తో విసిగిపోయారు కాబట్టే కదా వేరే పార్టీ వైపు చూస్తున్నారు. అలాంటి సమయంలో ప్రజలు తీసుకున్న నిర్ణయం అధికారులకు కూడా ఆమోదయోగ్యం కావాలి కానీ, వాళ్ళు తెరాస కోసమే పనిచేస్తాం అనడం ప్రజాధిక్కారం అవుతుంది, అంటే ప్రజల మేలు కాకుండా అధికారులు స్వప్రయోజనాల కోసమే రాజకీయాలవైపు వస్తున్నారనేది ఇక్కడ అంశం కానుంది. అధికారి ఉత్తముడై ఉంటె ప్రజలు వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ లోకి  వెళ్లడం జరగకూడదు, కానీ ఇక్కడ అధికారులు ఎంచుకున్న పార్టీ అధికార పార్టీ. ఈ స్థితిలో ఎవరి కోసం వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి ఇలా పార్టీలలో చేరడం జరుగుతుందో ఆయా అధికారులకు, పార్టీలకే ఆ మతలబు తెలియాల్సి ఉంది.



జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ .. ఎవరు..?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>