PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-puvvada-ajay-fans-warning-to-the-head-of-a-leading-telugu-media-company0350feec-e971-43f4-86a3-38d89de80034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-puvvada-ajay-fans-warning-to-the-head-of-a-leading-telugu-media-company0350feec-e971-43f4-86a3-38d89de80034-415x250-IndiaHerald.jpgప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత‌కు తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి అభిమానుల పేరుతో బ‌హిరంగ లేఖ‌ను కూడ విడుద‌ల చేసారు. త‌మ నేత‌పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చ‌రించారు. జ‌నంలో ఉండి జ‌నం కోసం ప‌ని చేసే వారి మీదనే మీ ఏడుపులు ఎందుకు..? మీ వైఖ‌రీ మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని.. పువ్వాడ అజ‌య్ సైన్యం గురించి తెలిసి కూడ ఎందుకు గోక్కుంటార‌ని పేర్కొన్నారు. మీరు ఎవ‌రి మోచేతి నీళ్లు తాగి ఇలా చేస్తు#puvvada ajay{#}Assembly;Army;Corporate;Kumaar;media;Bhumika Chawla;Telangana;Ministerప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత‌కు మంత్రి పువ్వాడ‌ అభిమానులు వార్నింగ్ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత‌కు మంత్రి పువ్వాడ‌ అభిమానులు వార్నింగ్#puvvada ajay{#}Assembly;Army;Corporate;Kumaar;media;Bhumika Chawla;Telangana;MinisterTue, 16 Nov 2021 11:32:01 GMTప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత‌కు తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి అభిమానుల పేరుతో బ‌హిరంగ లేఖ‌ను కూడ విడుద‌ల చేసారు. త‌మ నేత‌పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చ‌రించారు. జ‌నంలో ఉండి జ‌నం కోసం ప‌ని చేసే వారి మీదనే మీ ఏడుపులు ఎందుకు..?  మీ వైఖ‌రీ మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని.. పువ్వాడ అజ‌య్ సైన్యం గురించి తెలిసి కూడ ఎందుకు గోక్కుంటార‌ని పేర్కొన్నారు. మీరు ఎవ‌రి మోచేతి నీళ్లు తాగి ఇలా చేస్తున్నారో తెలుసు అని ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ అయిన ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర పేరును ఊటంకిస్తూ ట్విట్ట‌ర్ ద్వారా వ్యాఖ్య‌లు చేసారు.

పేద ప్ర‌జ‌ల‌కు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాల‌నే ఉద్దేశంతో ఆస్ప‌త్రిని స్థాపించి మూడు ద‌శాబ్దాల నుంచి పేద‌ల‌కు వైద్యం అందిస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంది 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి 2019లో ర‌వాణాశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పువ్వాడ అజ‌య్‌పై గ‌త రెండు నెల‌ల నుంచి  ప్ర‌చారం చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌లను ఖండిస్తున్న‌ట్టు అభిమానులు ప్ర‌క‌టించారు. భార‌త ప్ర‌జాస్వామ్య సౌద్యానికి శాస‌న వ్య‌వ‌స్థ‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ, న్యాయ‌వ్య‌వ‌స్థ మూడు స్థంబాలుగా భావిస్తుంటారు.

నాలుగ‌వ ఎస్టేట్‌గా పిలుచుకునేది మీడియా కూడ కీల‌క భూమిక వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందిన నాయ‌కుడిపై మీరు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని, మీది మీడియా సంస్థ‌నా..? లేక రాజ‌కీయ పార్టీనా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ చేసే మంచి కార్య‌క్ర‌మాలు ఏవి ప్ర‌చారం చేయ‌ర‌ని, విప‌క్ష నేత‌ల మాదిరిగానే మీ అక్క‌సును, పైత్యాన్ని వెల్ల‌గ‌క్కారు. తాజాగా మ‌రో ఆఫ్ ది రికార్డులో మంత్రిపై ప్ర‌సారం చేసారు. ఇదేనా మీ నీతి బాధ్య‌త‌, ఇదే  మీ మీడియా స్వేచ్ఛ‌నా..?   ఇలాంటివి మ‌రొక‌సారి పున‌రావృతం కాకుండా మీ ఛాన‌ల్ యాజ‌మాన్యం చూసుకుంటార‌ని, లేని ప‌క్షంలో న్యాయప‌రంగా, చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌కుండా ఉంటార‌ని ఆశిస్తున్నాం అని మంత్రి అభిమానులు వెల్ల‌డించారు.








అమరావతి మైలేజ్ కోసం బీజేపీ పాట్లు....!

ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ

ఏం కేసీఆర్ తలలు నరుకుతావా...?

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రారు

ఢిల్లీ కొంప ముంచిన దీపావళి...?

హైదరాబాద్ లో ఆ రెండు శవాలు ఎక్కడివి...?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

గోదావరి జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>