PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-murder5a995af7-c5c6-4a5b-9c4f-16ee8b71dc5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-murder5a995af7-c5c6-4a5b-9c4f-16ee8b71dc5b-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య ఉదంతం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల ఈ కేసులో నిందితుడైన దస్తగిరి వాంగ్మూలం బయటకు రావడం కలకలం సృష్టించింది. తాను, ఎర్ర గంగిరెడ్డి, మరికొందరు ఈ హత్యలో పాల్గొన్నామన్న దస్తగిరి.. ఈ హత్య వెనుక వైఎస్ కుటుంబ పెద్దలు ఉన్నారని తనతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ హత్యతో ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హviveka murder{#}sunil;devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Proddatur;Arrest;Murder.;News;MP;CM;రాజీనామా;Minister;Reddy;CBI;YCPవివేకా హత్యపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!?వివేకా హత్యపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!?viveka murder{#}sunil;devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Proddatur;Arrest;Murder.;News;MP;CM;రాజీనామా;Minister;Reddy;CBI;YCPTue, 16 Nov 2021 23:00:00 GMTఏపీ సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య ఉదంతం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల ఈ కేసులో నిందితుడైన దస్తగిరి వాంగ్మూలం బయటకు రావడం కలకలం సృష్టించింది. తాను, ఎర్ర గంగిరెడ్డి, మరికొందరు ఈ హత్యలో పాల్గొన్నామన్న దస్తగిరి.. ఈ హత్య వెనుక వైఎస్ కుటుంబ పెద్దలు ఉన్నారని తనతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ హత్యతో ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.


తాజాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం లేదని.. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే నాతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
శివప్రసాద రెడ్డి అన్నారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యేలందరం కలిసి మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి.. అవినాష్ రెడ్డిని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం తెర వెనుక చేస్తున్నారని మండిపడ్డారు.


తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఎర్రగంగిరెడ్డి మరో ముగ్గురిని కలుపుకుని హత్య చేసేందుకు పథకం వేశారన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి.. వివేకా హత్యలో పాల్గొన్నానని  దస్తగిరి వాంగ్మూలం ఇస్తే అతన్ని ఇంతవరకు సీ బీ ఐ అధికారులు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నించారు. హంతకుడిని సాక్షిగా మార్చమని సీబీఐ కోరుతోందని.. వివేక హత్యకు ఎర్రగంగిరెడ్డే మూలం అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి చెబుతున్నారు.


వైఎస్‌ వివేకాను ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, ఉమామహేశ్వర రెడ్డి, సునీల్ యాదవ్ మాత్రమే హత్య చేశారని.. ఈ హత్యతో ఎంపీ అవినాష్ కు ఏమాత్రం ప్రమేయం లేదని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.  ఈ హత్యతో ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధం ఉన్నా.. లేకపోయినా.. దస్తగిరి వాంగ్మూలంతో మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.



భారతీయుడు -2 షూటింగ్ జరిగేది అప్పుడేనా...?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>