PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandi-sanjay7067d62a-a295-4b36-b8e8-0a5cfda975f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandi-sanjay7067d62a-a295-4b36-b8e8-0a5cfda975f7-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తున్నా సరే ఆయనకు బిజెపి నాయకులు నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సీఎం కేసీఆర్ బండి సంజయ్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో బీజేపీ నాయకుల నుంచి సహకారం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. ఇటీవలి కాలంలో కొంతమంది బిజెపి నాయకులు బండి సంజయ్ మాట వినకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో స్నేహం చేయడం కూడా ఆయనకు బాగా ఇబ్బంది కరంగా మారిన అbjp{#}G Kishan Reddy;Vijayashanti;Nalgonda;bhavana;central government;Allu Aravind;Bharatiya Janata Party;CM;News;Press;Partyఒంటరి బండి... ఇదో కష్టం...?ఒంటరి బండి... ఇదో కష్టం...?bjp{#}G Kishan Reddy;Vijayashanti;Nalgonda;bhavana;central government;Allu Aravind;Bharatiya Janata Party;CM;News;Press;PartyTue, 16 Nov 2021 19:00:00 GMTతెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తున్నా సరే ఆయనకు బిజెపి నాయకులు నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సీఎం కేసీఆర్ బండి సంజయ్ ను  టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో బీజేపీ నాయకుల నుంచి సహకారం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. ఇటీవలి కాలంలో కొంతమంది బిజెపి నాయకులు బండి సంజయ్ మాట వినకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో స్నేహం చేయడం కూడా ఆయనకు బాగా ఇబ్బంది కరంగా మారిన అంశం అనేది కొంతమంది చెప్పే మాట.

అయితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని చర్చల ఆధారంగా చూస్తే బండి సంజయ్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గాని పెద్దగా సానుకూలంగా లేరని అంటున్నారు. బండి సంజయ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వేల నుంచి పెద్దగా సహకారం లేదని నిన్న నల్గొండ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమం విషయంలో కూడా పెద్దగా వారి నుంచి సహకారం లేదనే విషయం అర్థం అవుతుందని బిజెపి నాయకులు కూడా అంటున్నారు. దీనికి సంబంధించి బండి సంజయ్ ఇప్పటికే పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడారని వార్తలు ఉన్నాయి.

ఇక సీఎం కేసీఆర్ పుట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని బిజెపి నాయకులు బండి సంజయ్ కు మద్దతుగా పెద్ద గా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. కేవలం విజయశాంతి మాత్రమే బండి సంజయ్ కు అండగా నిలబడటం ఆ తర్వాత డీకే అరుణ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎలా పెద్దగా ఎవరూ కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి లేదు అనేది ఇప్పుడు ఆసక్తి గల చర్చ.



క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>